వైసీపీ స్పోక్స్ పర్సన్స్ వీరే

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి మరో వైపు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే భారీ విజయాలను నమోదు చేసుకుని మంచి ఊపు మీదున్న ఆయన రాబోయే మరో ఐదేళ్లు తమ పార్టీనే అధికారంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు వేలాదిగా గ్రామ వాలంటీర్లను నియమించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేశారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ౩౦ మంది సభ్యులతో అధికార ప్రతినిధుల జాబితాను ఎంపిక చేశారు.  పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరందరినీ అధికార ప్రతినిధులుగా ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి వెల్లడించారు. పార్టీకి సంబంధించి ఇక నుంచి వీరు స్పోక్స్ పర్సన్స్ గా వ్యవహరిస్తారు.

ఇక ఎంపిక చేసిన వారిలో..ఉండవల్లి శ్రీదేవి, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్‌, సిదిరి అప్పలరాజు, అదీప్‌ రాజ్‌ ఉన్నారు. వీరితో పాటు మహ్మద్‌ ఇక్బాల్‌, అంబటి రామ్ బాబు, కాకాని గోవర్థనరెడ్డి, జి.శ్రీకాంత్‌ రెడ్డి , భూమన కరుణాకర్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నారమల్లి పద్మజ, కాకమాను రాజశేఖర్‌, అంకంరెడ్డి నారాయణ మూర్తి, నాగార్జున యాదవ్‌, రాజీవ్‌ గాంధీ, కె.రవిచంద్రారెడ్డి, ఈదా రాజశేఖర్‌ రెడ్డి, పి.శివ శంకర్‌ రెడ్డి లు ఉన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!