మెరిసిన రోహిత్..నిలిచిన రహానే


సౌత్ ఆఫ్రికా తో ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలుచుకున్న టీమిండియా మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉండడం..అతనికి అజింక్య రహానే తోడు కావడంతో భారత్ భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది. రోహిత్ ఈ టెస్టులో వరల్డ్‌ రికార్డును నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మూడో సిక్సర్‌ కొట్టిన తర్వాత ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.

2018-19 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హెట్‌మెయిర్‌ 15 సిక్సర్లు కొట్టాడు. 2010-11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో హర్భజన్‌ సింగ్‌ 14 సిక్సర్లు కొట్టాడు. భారత్‌ తరఫున ఇప్పటి వరకూ అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల రికార్డు. దాన్ని కూడా సవరించాడు రోహిత్‌. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 130 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. రోహిత్‌కు టెస్టుల్లో 6వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడో శతకం.అంతే కాకుండా టెస్టుల్లో రెండు వేల పరుగుల్ని రోహిత్‌ పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్‌కు 30వ టెస్టు. ప్రారంభమైన మూడో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీతో దుమ్ము రేపిన మయాంక్‌ అగర్వాల్‌ ఈ టెస్ట్ లో త్వరగా పెవిలియన్ కు చేరుకున్నాడు. కాసేపటికి చతేశ్వర పుజారా డకౌట్‌ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించాడు. దక్షిణాఫ్రికా పేసర్‌ నార్జీ వేసిన బంతికి కోహ్లి దొరికి పోయాడు. ఆ తరుణంలో రోహిత్ రహానే తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వన్డే తరహాలో బౌండరీల మోత మోగించాడు. రహానే కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 150కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్‌ గాడిలో పడింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!