అమితాబ్ ఆరోగ్యం పదిలం


భారతదేశం గర్వించే అరుదైన నటుడిగా పేరున్న బిగ్ బి, అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం పదిలంగానే ఉంది. కాలేయ సంబంధిత వ్యాధితో కొన్నేళ్ల నుంచి బాధ పడుతూ వస్తున్నారు. ఇటీవల మరోసారి నొప్పి అనిపించడంతో అమితాబ్ పుణేలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఎప్పటి లాగే వైద్యుల పర్యవేక్షణలో వైద్యుల సలహాలు తీసుకుంటూ వస్తున్నారు. నాలుగు రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉన్నారు. అనంతరం అమితాబ్ ను డిశ్చార్జ్ చేశారు. ఆయన వెంట సతీమణి జయా బచ్చన్‌, కొడుకు అభిషేక్‌ బచ్చన్‌ ఉన్నారు. కాగా బాలీవుడ్ లో అందరి నటుల కంటే ఎక్కువగా బిగ్సో బి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు.

అయితే  బిగ్‌బీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా వరుసగా రెండు ట్వీట్లు చేసి అభిమానులను పలుకరించారు. మొదటగా జయా బచ్చన్‌తో కార్వా చౌత్‌ పండుగలో పాల్గొన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. అంతే కాకుండా స్వతహాగా కవి అయిన అమితాబ్‌ .. దానికి అందమైన క్యాప్షన్‌ కూడా జత చేశారు. ఆమె నాలో సగం అందుకే హాఫ్‌ ఇమేజ్‌ కనిపించేటట్టు షేర్‌ చేశా అని ట్వీట్ చేశారు. మిగతా సగం కనిపించాల్సిన అవసరమేముంది అని పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్‌లో జయాతో కలిసి వారం క్రితం పాల్గొన్న ఒక ఈవెంట్‌ ఫొటో జత చేశారు. ఇదిలా ఉండగా..20 ఏళ్ల కిందట కూలీ నెం.1 సినిమా షూటింగ్‌లో అమితాబ్‌ తీవ్రంగా గాయ పడ్డారు.

ఆయనకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆ సమయంలో జరిగిన ఓ పొరపాటు బిగ్‌బీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. సరైన రక్తం ఎక్కించని కారణంగా ఆయన కాలేయం చెడి పోయింది. తన కాలేయంలో కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తుందని, అయినప్పటికీ వైద్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉన్నానని బిగ్‌బీ ఓ సందర్భంలో చెప్పారు. ఇక అమితాబ్‌ తాజాగా ‘చెహ్రే అండ్‌ గులాబో సితాబో’ చిత్రంలో నటిస్తున్నారు. మరో వైపు కౌన్‌ బనేగా కరోడ్‌ పతి 11వ సీజన్‌కు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద బిగ్ బి హెల్త్ పదిలంగా ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!