ఇక తెలంగాణకు తమిళిసై చికిత్స ..!

భారత దేశంలో ఇప్పుడు రెండే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువగా కనిపిస్తున్నాయి కూడా . వారెవ్వరో కాదు ..ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే మరొకరు అమిత్ షా. ఆర్ ఎస్సెస్ , వీహెచ్ పి, భజరంగ్ దళ్ పరివారాలల్లో వీరి మాటకు తిరుగు లేకుండా పోయింది. ఎందుకంటే రెండవ సారి కేంద్రంలో వీరిద్దరి నేతృత్వం లోనే భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన రీతిలో అధికారంలోకి వచ్చింది. దేశమంతటా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం లోకి రావాలనే టార్గెట్ తో ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. నార్త్ లో హవా కొనసాగిస్తున్న బీజీపీకి సౌత్ లో కూడా జెండా ఎగుర వేయాలన్నది లక్ష్యం. అందు కోసమే కాంగ్రెస్ , జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ను కాదని కర్ణాటకలో కాషాయం కొలువు తీరేలా చేశారు షా అండ్ మోదీ. ఇదే సమయంలో తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది. ఎలాగైనా సరే అధికారం లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాలు పన్నుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నది. దీనిని దెబ్బ కొట్టాలంటే బిజిపికి ఇప్పుడున్న బలం చాలదు. చాప కింద నీరులా అల్లుకు పోయే కేడర్...