ఇక తెలంగాణకు తమిళిసై చికిత్స ..!

భారత దేశంలో ఇప్పుడు రెండే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువగా కనిపిస్తున్నాయి కూడా . వారెవ్వరో కాదు ..ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే మరొకరు అమిత్ షా. ఆర్ ఎస్సెస్ , వీహెచ్ పి, భజరంగ్ దళ్ పరివారాలల్లో వీరి మాటకు తిరుగు లేకుండా పోయింది. ఎందుకంటే రెండవ సారి కేంద్రంలో వీరిద్దరి నేతృత్వం లోనే భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన రీతిలో అధికారంలోకి వచ్చింది. దేశమంతటా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం లోకి రావాలనే టార్గెట్ తో ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. నార్త్ లో హవా కొనసాగిస్తున్న బీజీపీకి సౌత్ లో కూడా జెండా ఎగుర వేయాలన్నది లక్ష్యం. అందు కోసమే కాంగ్రెస్ , జేడీఎస్ సంకీర్ణ సర్కార్ ను కాదని కర్ణాటకలో కాషాయం కొలువు తీరేలా చేశారు షా అండ్ మోదీ. 

ఇదే సమయంలో తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది. ఎలాగైనా సరే అధికారం లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాలు పన్నుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నది. దీనిని దెబ్బ కొట్టాలంటే బిజిపికి ఇప్పుడున్న బలం చాలదు. చాప కింద నీరులా అల్లుకు పోయే కేడర్ ఉన్నా , కేసీఆర్ కు ధీటైన నాయకుడు బీజీపీకి లేరు. ఇప్పటి దాకా గవర్నర్ గా ఉన్న నరసింహ్మన్ ..ఈ సీఎం కు అనుకూలంగా వ్యవహించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సర్కార్ కు పక్కలో బల్లెం లా ఉండే వ్యక్తి ..తమిళ నాట ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న తమిళిసై ని ఏరి కోరి మోదీ , అమిత్ షా తెలంగాణకు గవర్నర్ గా ఎంపిక చేశారు.

దీంతో ఒక్క సారిగా ఆమె నియామకం గులాబీ దళంలో ప్రకంపనలు సృష్టిస్తే , మరో వైపు కాషాయంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వృత్తి రీత్యా వైద్యురాలైన తమిళిసై అంచెలంచెలుగా తమిళనాడు బీజేపీలో ఎదిగారు. మహిళా నాయకురాలిగా ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అంతే కాకుండా దమ్మున్న నాయకురాలిగా కార్యకర్తల్లో ధైర్యం నింపారు. అక్కడ ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీశారు. దీంతో బీజేపీ అనుకోని రీతిలో బలం పుంజుకుంది. తమిళ నాడు , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించేందుకు పావులు కదుపుతోంది. ఓ వైపు జగన్ కు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా ఏ మాత్రం దయ చూపడం లేదు. ఏపీలో కూడా సర్కార్ కు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుంది. మొత్తం మీద కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ తమిళ లీడర్ ..బాధ్యతలు చేపట్టాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!