టెస్ట్ సిరీస్ కైవసం..అభిమానుల్లో ఆనందం
ప్రపంచ కప్ లో హాట్ ఫెవరెట్ గా ఉన్న టీమిండియా సెమీ ఫైనల్ లో చతికిల పడడంతో క్రికెట్ అభిమానులు సారధి కోహ్లీ, కోచ్ శాస్త్రి ల మీద తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఒక దశలో కోచ్ పదవి కోసం బీసీసీఐ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎంపిక చేసే బాధ్యతను హరికేన్ కపిల్ దేవ్ ను నియమించింది. కానీ కోహ్లీ కే పూర్తి బాధ్యతలు అప్పగించడంతో, తిరిగి అనుమానాలకు తెర దించుతూ రవిశాస్త్రి కే కోచ్ పదవిని కట్టబెట్టింది. అంతే కాకుండా టీమ్ ఎంపికలో కూడా ఏ ఒక్కరి ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా వ్యహరించింది.
ఇందు కోసం బలమైన జట్టును వెస్ట్ ఇండీస్ పర్యటనకు ఎంపిక చేసింది. కోహ్లీ వరల్డ్ కప్ ఓటమి ని మైమరపించేలా తాను ఆడుతూ జట్టు సభ్యులలో కాన్ఫిడెన్స్ నింపాడు. వన్ డే సిరీస్ తో పాటు తాజాగా టెస్ట్ సిరీస్ కూడా భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. తమకు ఎదురు లేదని చాటింది. తెలుగు వాడైన హనుమ విహారి అద్భుతంగా రాణించాడు. తన సత్తా ఏమిటో రుచి చూపించాడు. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను మన ఆటగాళ్లు దుమ్ము రేపారు . మొత్తం మీద రెండో టెస్ట్ లోను విజయం సాధించారు. అభిమానులకు ఆనందం కలిగించారు. మొదటి టెస్ట్ లో భారీ తేడాతో గెలుపొందిన ఇండియా రెండో టెస్ట్ లోను దానినే కంటిన్యూ చేసింది.
జడేజా , షమీ లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్ తల వంచక తప్పలేదు. అయిదు రోజుల మ్యాచ్ లో ఇండియా నాలుగు రోజులకే కథ ముగించేలా చేసింది. టీ 20 తో స్టార్ట్ చేసిన ఇండియా వన్డే, టెస్ట్ లతో పరిపూర్ణం చేసింది. 468 పరుగుల భారీ టార్గెట్ తో దిగిన విండీస్ ఏ స్థాయిలోను ఎదుర్కోలేక పోయింది. 210 పరుగులకే ఆలవుట్ అయ్యింది. జడేజా, షమీ , ఇషాంత్ శర్మలు పోటా పోటీగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి విండీస్ బ్యాట్స్ మెన్స్ విలవిలలాడి పోయారు. ఛేజ్ , హెట్ మైయర్ వెను దిరగడంతో బరిలోకి వచ్చిన కాన్కషన్, వుడ్ లు ఆడడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. సారధి హోల్డర్ చివరలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. ఓటమి నుండి కాపాలేక చేతులెత్తేశాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి