అలౌకిక ఆనందం..కృష్ణ తత్వం..!

ప్రపంచంలో హరే రామ హరే కృష్ణ ..కృష్ణ కృష్ణ హరే..అంటూ మెలమెల్లగా వినిపిస్తోంది. ఇలా లోకమంతటా వ్యాపించేలా చేసిన ఘనత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. ఎక్కడ చూసినా వీరే దర్శనం ఇస్తారు. ఇతోధికంగా తమకు తోచిన రీతిలో సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు శ్రీకృష్ణుడు బోధనలను ప్రచారం చేస్తున్నారు. ఇస్కాన్ పేరుతో దేవాలయాలు, ఆశ్రమాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దైవారాధన, సేవారాధన, భక్తిని ప్రసరింప చేయడం వీరి ఉద్దేశం. హైదరాబాద్ లోని అబిడ్స్ తో పాటు సికింద్రాబాద్ లో కూడా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి రోజు పూజలు జరుపుతారు. ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఆదివారం కడుపు నిండా భోజనం, పాయసం పెడతారు. వీరి ఆధ్వర్యంలో దేశంలోనే అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే పేద పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన వారి ఆకలిని తీర్చే పనిని ప్రారంభించారు. అదే అక్షయపాత్ర. మొదట్లో కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ బృహత్తర పథకం దేశమంతటా విస్తరించింది. లక్షలాది మందికి ఉచితంగా, ఆకలితో అలమటించే పిల్లల ఆకలిని తీరుస్తోంది. ఇస్కాన్ ఈ రూపకంగా భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేస్తోంది. దీనికి ఆయా రాష...