ధ్యానం జీవన యోగం
దీంతో బంధాలు పూర్తిగా ప్లాస్టిక్ నవ్వులతో, పలకరింపులకే పరిమితమై పోయాయి. జస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా అందులోనే హాయ్, బైబై చెప్పేసు కోవడంతోనే తెల్లారి పోతోంది. ఈ లోకంలో దైవం ఇచ్చిన వరం ఏదైనా ఉందంటే అది ఒక్కటే మానవ జన్మ. ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఎన్నో ఉన్నప్పటికీ ఆలోచించి, అద్భుతాలు సృష్టించే మరో ప్రపంచాన్ని, గగన తలాన్ని, చందమామను సైతం అందుకునే మానవ జన్మ మహోన్నతమైనది. ఇదే సమయంలో అనుకోని రీతిలో పోటీ ఎక్కువై పోయింది. శ్వాస పీల్చు కోవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేంత దాకా యుద్ధమే. రాను రాను చేతుల్లో సరిపోయేంత డబ్బులున్నా..బ్యాంకుల్లో తరాలకు సరిపడా డబ్బులు ఉన్నా, చెప్పు కోవడానికి ఆస్తులు, అంతస్తులు, ఆభరాణాలు, వజ్ర వైఢూర్యాలు ఉన్నా..పాకెట్ లో డాలర్లున్నా ఏదో అసంతృప్తి మనుషుల్ని తొలచి వేస్తోంది. ఇదంతా ఉరుకుల పరుగుల జీవితం. మొత్తంగా చూస్తే శరీరాలకు అలసట ఎక్కువై పోయింది..శాంతి కరువై పోయింది. ఏకంగా జనం తమ నుంచి తాము వేరై పోయారు.
దీంతో ప్రతి ఒక్కరు లక్షలాది రూపాయలు తగలేస్తున్నారు. కొందరు తట్టుకోలేక వ్యసనాలకు బానిస అవుతే ..మరికొందరు మాత్రం తమను తాము తెలుసు కోవడానికి, ఆనందం, సంతోషం వెతుక్కోవడానికి, దేవాలయాలను, దేవుళ్లను, బాబాలను, యోగులను, స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో యోగం..ధ్యానం ఫక్తు వ్యాపారంగా మారింది. ఇందులో ఓ పది శాతం మాత్రమే నిజాయితీగా మానవ లోకానికి మేలు చేకూరుస్తుంటే మాగతా వాళ్లంతా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఆశ్రమాలు, పీఠాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మనల్ని మనం ప్రేమించు కోక పోవడమే మన అసంతృప్తికి కారణం. అందుకే ఇష్టమైన వాటితో మమేకమై పోతే జీవితం హాయిగా సాగుతుంది. బతుకు పండగ అవుతుంది. మనల్ని మనం తెలుసుకుని, స్వాంతన పొందే మార్గమే ధ్యానం. అదే జీవన యోగం. ఇందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిన పని లేదు. మీలోనే ఉంది..జస్ట్ ప్రయత్నం చేస్తే కావాల్సినంత జోష్ దక్కుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి