సింధు సరే…వీళ్లకేం తక్కువ ..?
ఈ దేశాన్ని కాషాయ మయం చేయాలని అనుకుంటున్న మోడీ, అమిత్ షా , ఆర్. ఎస్ . ఎస్. పరివారం సక్సెస్ అయినప్పటికీ, ఇంకా కార్పొరేట్ , బిజినెస్ టైకూన్లు , రిలయన్స్ అంబానీ, ఆదానీలదే హవా నడుస్తోంది. మన్ కీ బాత్ , స్వచ్ఛ భారత్ అని ప్రచారం చేస్తున్నంతగా దేశం ఎదగడం లేదు. వీరి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. ఏకంగా వ్యాపారం పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ ఆస్తులు సంపాదిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బడా బాబులకు వంత పాడుతోంది. ఈ బిలియనీర్లు ఇప్పుడు ఆటగాళ్లను స్పాన్సర్ చేస్తున్నారు. వీరిని బ్రాండ్ అంబాసిడర్లు గా వాడుకుంటున్నారు. ఇండియాలో మహిళల విభాగంలో పీవీ సింధు ఏడాదికి 20 కోట్లకు పైగానే సంపాదిస్తోందని అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ స్థాయిలో ఒకే ఒక్క ఛాంపియన్ షిప్ సాధించిన సింధును ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
కానీ అయిదు బంగారు పతకాలు సాధించి పెట్టి , దేశాన్ని , జాతిని తలెత్తుకునేలా చేసిన చిరుత పులి హిమ దాస్, బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన మేరీ కోమ్ , ఒకే కాలుతో ప్రతిభ చూపిన జోషి గురించి ఏ మీడియా మాట్లాడటం లేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం సింధుకు భారీ ఎత్తున నజరానా ప్రకటించింది. ఆమె కోచ్ కు కూడా స్థలం కేటాయించింది. ఈమె వెంట చాముండేశ్వరి నాథ్ ఉన్నాడు. ఇతడిపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఆధిపత్యం పోలేదు. మరో వైపు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ , రోడ్డు ప్రమాదంలో సగం దాకా కాలు కోల్పోయినా మొక్కవోని పట్టుదలతో సింధు కంటే ఒక రోజు ముందుగా నే పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న మానషి జోషి గురించి లోపలి పేజీల్లో , చిన్న వార్తలు వేశారు.
ఇప్పటికైనా మీడియా మారాలి. ముందుగా పాలకులు మారాలి. సింధును తక్కువ చేయడం కాదు కానీ ఆమెతో పాటు వీరు సాధించిన విజయాలు తక్కువేమి కాదు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు నిధులు కేటాయించి , మౌలిక వసతులు కల్పిస్తే ఈ దేశంలో లెక్కలేనంత మంది ప్రపంచ ఛాంపియన్లుగా అద్భుత విజయాలు సాధించగలరు . సో..హిమదాస్, మేరీకోమ్ , జోషిలు కష్టాలను దాటుని, కన్నీళ్లు దిగ మింగుకుని బతుకును జయించారు. విజేతలుగా నిలిచి ప్రపంచాన్ని విస్మయ పరిచారు. భరత మాత మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ పట్టుదలను చూసి సంతోషిస్తుంది. మీ వెంట మేమున్నామని జాతి చెబుతోంది. మట్టి బిడ్డలారా మీకు జోహార్లు ..జేజేలు…!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి