పల్లెతనపు సంబురం !
పొద్దు వాలిపోక ముందే
ఊరు ఉత్సవమై ఉరుకలు వేస్తుంది
సూర్యుడు పలకరించే లోపే
పరవశమై ఊగిపోతుంది
జనమంతా జాతరై
గొంతెత్తి నినదిస్తారు
ఒకే పాటై పల్లవిస్తారు
ఊరు ఉత్సవమై ఉరుకలు వేస్తుంది
సూర్యుడు పలకరించే లోపే
పరవశమై ఊగిపోతుంది
జనమంతా జాతరై
గొంతెత్తి నినదిస్తారు
ఒకే పాటై పల్లవిస్తారు
జ్ఞాపకాల తలపుల్లో
పల్లెతనపు ప్రేమలు
అలరారి పోతాయి
ప్రతి గుండెను ప్రేమగా
పలకరిస్తాయి.. గుండెల్లో
దాచుకుంటాయి
ప్రతి గడప ఆ రోజంతా
ఒకే నాదమై దుఖపు గీతాన్ని
హృద్యంగా ఆలాపిస్తుంది
కమ్మని కలలు ఇంకిపోతాయి
రాలిన కొమ్మల మీద
పావురాలై వాలి పోతాయి
పిల్లలు. పెద్దలు
ఒకే తాళమై పల్లె గుండెను
తడుముతారు
తమలో భద్రంగా దాచుకుంటారు
ఒకటా రెండా
అన్నీ అక్కడికే
ఊరుమ్మడి బొడ్రాయి దగ్గర
సమూహం సంబురమై
అబ్బుర పరిచేలా చేస్తుంది
యెదలో తారంగం
మదిలో పీర్ల శబ్దం
ఖంగున మోగుతుంది
తెల్లారిన బతుకుల్లో
వెలుగులు నింపుతుంది !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి