పోస్ట్‌లు

డిసెంబర్ 19, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

అభిశంసనం..డోనాల్డ్ కు కష్ట కాలం

చిత్రం
నిన్నటి దాకా ప్రపంచాన్ని గడగడ లాడించిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన పదవిని కోల్పోయే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. సెనేట్‌ లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ దిగి పోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డు కున్నారనేది రెండో ఆరోపణ. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు అనుకూలంగా 230 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ను అడ్డకున్నారన్న ఆరోపణలకు అనుకూలంగా 229 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన జో బిడెన్‌ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్‌ను ఒత్తిడి చేసి, ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని ట్రంప్‌ కోరడం అధికార దుర్వినియోగమని అభియోగంలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ విచారణకు ట్...

భారం మోయలేం..సేవలు ఇవ్వలేం

చిత్రం
నిన్నటి దాకా టెలికాం రంగాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న ఎయిర్ టెల్ కంపెనీ ఇప్పుడు చేతులెత్తేసే పనిలో పడ్డది. ఇక ఈ భారాన్ని మోయలేమంటూ వాపోతోంది. ఇండియాలో భారత టెలికాం నియంత్రణ సంస్థ కు ఈ టెలికం దిగ్గజ కంపెనీ మొర పెట్టుకుంటోంది. రోజు రోజుకు ఖర్చులు పెరిగి పోతున్నాయని, ఆదాయం గణనీయంగా తగ్గుతోందని, ఈ పరిస్థితుల్లో ఉచిత సేవలు అందించలేమని అంటోంది ఎయిర్ టెల్ కంపెనీ. ఇప్పటికే భారీ మొత్తంలో సదరు కంపెనీ ట్రాయ్ కి డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. ఈ మేరకు అన్ని టెలికాం కంపెనీలు ఒక్క బిఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వ కంపెనీ తప్ప ఎయిర్ టెల్, వోడా ఫోన్ - ఐడియా, రిలయన్స్ జియో కంపెనీలు సైతం దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అంతే కాకుండా మొత్తం డబ్బులను కేవలం మూడు నెలల లోపు చెల్లించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిన్నటి దాకా ఆదాయమే మార్గంగా, వినియోగదారులను పీల్చి పిప్పి చేసిన ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు తమ ఆస్తులను అమ్మే పనిలో పడ్డాయి. తమకు కొంత గడువు కావాలని కోరుతున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ కంపెనీ సైతం తన సర్వీసుల్లో ఒక్కో దానిని మూసుకుంటూ వస్తోంది. అత్యంత చౌక చార్జీలు, భ...

రవాణా కోసం రైట్ రైట్

చిత్రం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఆయన కార్మికుల సాక్షిగా ప్రకటించినట్టుగానే ఆర్టీసీని ఆదాయ మార్గంలోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఏకంగా కార్గో సేవలు అందించాలని సంబంధిత మంత్రితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎలాంటి బస్సులు వాడాలి. వాటికి ఎలాంటి రంగు ఉండాలి. ఎవరెవరు సిబ్బంది అవసరం అవుతారనే దానిపై కూలంకుషంగా చర్చించారు. అందులో భాగంగానే ఇక నుంచి నూతన జవసత్వాలు సంతరించు కోనున్నది ఆర్టీసీ. ఈ కొత్త రవాణా సేవలు కొత్త సంవత్సరం నుంచి మొదలు కాబోతున్నాయి. అంతే కాకుండా ఎరుపు రంగులో ఆర్టీసీ సరుకు రవాణా వాహనాలు రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆర్టీసీలోని పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చి, గోదాములతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లతో అనుసంధానం అవుతాయి. అనంతరం ఇవే వెహికిల్స్ సరులను ఆయా ప్రాంతాలకు తరలిస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చే కసరత్తు మొదలైంది. తొలి వాహనం సిద్ధం కానుంది. తొలి విడతలో...

ఐటీలో బెంగళూరు నెంబర్ వన్

చిత్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఇండియాలో బెంగళూర్ మళ్ళీ టాప్ పొజిషన్ లో నిలిచింది. సిటీ సిలికాన్ నగరంగా పిలుచుకునే ఈ నగరం ఇప్పుడు మరోసారి తన ప్లేస్ ను కాపాడుకుంటూ వస్తోంది. అంతే కాదు దేశంలో అత్యధిక వేతనాలను ఐటీ ఫ్రొఫెషనల్సే అందుకుంటున్నారు. ఇందులో ఐటీ సీటీ బెంగళూర్‌ అత్యధిక వేతనాలను చెల్లించే నగరంగా ముందుందని రాండ్‌ స్టడ్‌ నివేదిక వెల్లడించింది. ఈ నగరంలో ఐటీ కంపెనీల్లో ఆయా లెవల్లో పని చేస్తున్న వారిలో జూనియర్‌ లెవెల్‌ టెకీకే సగటు వేతనం 5.27 లక్షలు కాగా, మధ్యస్ధాయి ఐటీ ఫ్రొఫెషనల్స్‌కు 16.45 లక్షలు, సీనియర్‌ లెవల్‌ టెకీకి 35.45 లక్షల వార్షిక వేతనం ఉందని తెలిపింది. ఈ సంస్థ 2017, 2018లో వెల్లడించిన శాలరీ ట్రెండ్స్‌ నివేదికలోనూ బెంగళూర్‌ అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఎంట్రీలెవల్‌ టెకీకి అత్యధిక వేతనాల్లో హైదరాబాద్‌ 5 లక్షలు ఇస్తుంటే, ముంబై 4.59 లక్షలు ఇస్తూ వరుసగా టాప్‌ టూ, టాప్‌ త్రీ స్ధానాల్లో నిలిచాయి. ఇక మధ్యస్ధాయి ఐటీ సిబ్బందికి వేతనాల విషయంలో ముంబై 15.07 లక్షలు ఇస్తుంటే , ఢిల్లీ ఎన్‌సీఆర్‌ 14.5 లక్షలు ఇస్తూ ముందుండగా, సీనియర్‌ ఉద్యోగుల వేతనాల్లో ముంబై 33.95 లక్షలు, పూణే 32.68  లక్ష...

వేలం పాట లో కమ్మిన్స్ టాప్

చిత్రం
అందరూ ఊహించని రీతిలో ఆస్ట్రేలియా ఫెసర్ కమ్మిన్స్ జాక్ పాటు కొట్టేశాడు. ఇది ఓ రికార్డ్. ఐపీఎల్‌ -2020 సీజన్‌లో భాగంగా భారీ ఎత్తున వేలంపాట స్టార్ట్ అయ్యింది. క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ దిగ్గజాలు మాత్రం కనీస రెండు కోట్లకంటే ఎక్కువగా అమ్ముడు పోతారని అనుకున్నారు. కానీ వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఏకంగా అతనికి15.50 కోట్ల భారీ ధర పలికింది. పలు ఫ్రాంచైజీలు కమిన్స్‌ కోసం పోటీ పడగా చివరకూ కేకేఆర్‌ కమిన్స్‌ను దక్కించుకుంది. అతనికి 10 కోట్ల వరకూ ధర పలుకుతుందని ఊహించనప్పటికీ అంతకు మించి అమ్ముడు పోవడం విశేషం. ప్రధానంగా రాయల్స్‌ చాలెంజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి. కాగా, కేకేఆర్‌ కచ్చితంగా కమ‍్మిన్స్‌ను దక్కించు కోవాలనే ఊపుతో అతని కోసం భారీ ధర వెచ్చించింది. ఫలితంగా 15 కోట్లకు పైగా కమ్మిన్స్‌కు ధర పలికింది. కాగా, ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ గుర్తింపు పొందాడు. ఆసీస్‌ క్రికెటర్‌ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌-2020 వేలంలో భారీ ధర పలికింది. అతని కనీస ధర 2 కోట్లు ఉండగా 10 కోట్లకు పైగా అమ్ముడు పోయాడు. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడగ...

పంత్ గాడిలో పడినట్లేనా

చిత్రం
నిన్నటి దాకా అగ్ని పరీక్షను ఎదుర్కుంటున్న రిషబ్ పంత్ గాడిలో పడినట్లేనని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ పంచ్ హిట్టర్ గా పేరొందిన ఈ యువ క్రికెటర్ ఇటీవల ఫార్మ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. తాజాగా రిషబ్ విండీస్ తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ మెరిశాడు. కుదురుగా కాకుండా ధీటుగా పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లతో ఆడుకున్నాడు. ఫామ్ కోల్పోయినా టీమిండియా మేనేజ్ మెంట్ పంత్ ఫెయిల్ అయ్యినా సరే కొనసాగిస్తూ వస్తోంది. రిషబ్ ను మరో ధోనీగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదే సమయంలో నిత్యం సోషల్ మీడియాలో ఉండే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాత్రం పంత్ కు తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని సూచిస్తున్నాడు.  మరింత నిలకడైన ప్రదర్శన చేయాలన్నారు. అప్పుడడప్పుడు మాత్రమే మెరుస్తున్న పంత్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే విషయంపై దృష్టి పెట్టాలన్నాడు. సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని పంత్‌ నిలబెట్టు కోవాలన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో పంత్‌ 71 పరుగులు సాధించి వన్డే ఫార్మాట్‌లో తన తొలి అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఎంఎస్‌ ధోని ఎంత నిలకడగా జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడేవాడో అదే తరహాలో రాణించడానికి పంత్‌ ట్రై చేయాలన...