వేలం పాట లో కమ్మిన్స్ టాప్
అందరూ ఊహించని రీతిలో ఆస్ట్రేలియా ఫెసర్ కమ్మిన్స్ జాక్ పాటు కొట్టేశాడు. ఇది ఓ రికార్డ్. ఐపీఎల్ -2020 సీజన్‌లో భాగంగా భారీ ఎత్తున వేలంపాట స్టార్ట్ అయ్యింది. క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ దిగ్గజాలు మాత్రం కనీస రెండు కోట్లకంటే ఎక్కువగా అమ్ముడు పోతారని అనుకున్నారు. కానీ వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఏకంగా అతనికి15.50 కోట్ల భారీ ధర పలికింది. పలు ఫ్రాంచైజీలు కమిన్స్ కోసం పోటీ పడగా చివరకూ కేకేఆర్ కమిన్స్‌ను దక్కించుకుంది. అతనికి 10 కోట్ల వరకూ ధర పలుకుతుందని ఊహించనప్పటికీ అంతకు మించి అమ్ముడు పోవడం విశేషం. ప్రధానంగా రాయల్స్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లు తీవ్రంగా పోటీ పడ్డాయి.
కాగా, కేకేఆర్ కచ్చితంగా కమ‍్మిన్స్‌ను దక్కించు కోవాలనే ఊపుతో అతని కోసం భారీ ధర వెచ్చించింది. ఫలితంగా 15 కోట్లకు పైగా కమ్మిన్స్‌కు ధర పలికింది. కాగా, ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్-2020 వేలంలో భారీ ధర పలికింది. అతని కనీస ధర 2 కోట్లు ఉండగా 10 కోట్లకు పైగా అమ్ముడు పోయాడు. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీ పడగా చివరకూ కింగ్స్ పంజాబ్ మ్యాక్స్‌వెల్‌ను 10. 75 కోట్లకు దక్కించుకుంది. గత పలు సీజన్లలో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడిన మ్యాక్సీ మళ్లీ ఆ జట్టుకు ఆడనున్నాడు.
తొలి రౌండ్‌లో మ్యాక్స్‌వెల్ ఆల్ రౌండర్‌గా రేసులోకి వచ్చాడు. అతని కోసం బిడ్‌ను కింగ్స్ పంజాబ్ ఆరంభించి చివరకు వశం చేసుకుంది. ఇక మరో ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫించ్ కోసం కేకేఆర్ తీవ్రంగా పోటీ పడినప్పటికీ ఆఖరికి ఆర్సీబీ దక్కించుకుంది. ఫించ్ కనీస ధర కోటి ఉండగా, 4.40 కోట్లకు ఆర్సీబీ చేజిక్కించుకుంది. మరో వైపు భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ప్రియాం గార్గ్‌లు ఐపీఎల్ వేలంలో ఫర్వా లేదనిపించారు. భారత ఆండర్-19 క్రికెటర్లైన జైస్వాల్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేయగా, గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
ఈ వేలంలో తొలుత ప్రియాం గార్గ్‌ను 1.90 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించు కోగా, జైస్వాల్‌ను 2.40 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ అయిన గార్గ్-జైస్వాల్‌ల కనీస ధర 20 లక్షలు ఉండగా పలు ఫ్రాంఛైజీలు వీరి కోసం పోటీ పడ్డాయి. ప్రధానంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ పంజాబ్‌లు వీరి కోసం ఆసక్తి చూపాయి. ఇక వరుణ్ చక్రవర్తిని కేకేఆర్ కొనుగోలు చేసింది. వరుణ్ చక్రవర‍్తికి 4 కోట్ల ధర వెచ్చించి కేకేఆర్ దక్కించుకుంది. దీపక్ హుడా కనీస ధర 40 లక్షలు ఉండగా అతన్ని 50 లక్షలకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. మొత్తం మీద ఇంకా వేలం పాట దెబ్బకు యువ క్రికెటర్ల పంట పండుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి