రవాణా కోసం రైట్ రైట్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఆయన కార్మికుల సాక్షిగా ప్రకటించినట్టుగానే ఆర్టీసీని ఆదాయ మార్గంలోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. ఇందు కోసం ఏకంగా కార్గో సేవలు అందించాలని సంబంధిత మంత్రితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎలాంటి బస్సులు వాడాలి. వాటికి ఎలాంటి రంగు ఉండాలి. ఎవరెవరు సిబ్బంది అవసరం అవుతారనే దానిపై కూలంకుషంగా చర్చించారు. అందులో భాగంగానే ఇక నుంచి నూతన జవసత్వాలు సంతరించు కోనున్నది ఆర్టీసీ. ఈ కొత్త రవాణా సేవలు కొత్త సంవత్సరం నుంచి మొదలు కాబోతున్నాయి.
అంతే కాకుండా ఎరుపు రంగులో ఆర్టీసీ సరుకు రవాణా వాహనాలు రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆర్టీసీలోని పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చి, గోదాములతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లతో అనుసంధానం అవుతాయి. అనంతరం ఇవే వెహికిల్స్ సరులను ఆయా ప్రాంతాలకు తరలిస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చే కసరత్తు మొదలైంది. తొలి వాహనం సిద్ధం కానుంది. తొలి విడతలో కనీసం వంద బస్సులను రూపొందించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సరుకు రవాణా వాహనాలకు ఎరుపు రంగును వాడుతున్నందున, వీటికి కూడా అదే రంగును వాడాలని సీఎం ఆదేశించారు.
వాహనం వెనక వైపు కొంతమేర క్రీమ్ కలర్ ఉంటుంది. ఒక్కోబస్సు ఇంచుమించు 7 టన్నుల సరుకును మోసే సామర్థ్యంతో సిద్ధం చేస్తున్నారు. మరో వైపు డ్రైవర్, కండక్టర్ ఉద్యోగ భద్రతకు సంబంధించి నాలుగైదు రోజుల్లో స్పష్టత రానుంది. ఆర్టీసీ కార్గో సర్వీసెస్ రంగంలోకి ఎంటర్ అవుతే ఆయాదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంత వరకు ఆర్టీసీని గట్టెక్కించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నది. మొత్తం మీద ఆయన మాటలే కాదు చేతలు కూడా ఆ దిశ వైపు సాగుతుండడం కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి