భారం మోయలేం..సేవలు ఇవ్వలేం
నిన్నటి దాకా టెలికాం రంగాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న ఎయిర్ టెల్ కంపెనీ ఇప్పుడు చేతులెత్తేసే పనిలో పడ్డది. ఇక ఈ భారాన్ని మోయలేమంటూ వాపోతోంది. ఇండియాలో భారత టెలికాం నియంత్రణ సంస్థ కు ఈ టెలికం దిగ్గజ కంపెనీ మొర పెట్టుకుంటోంది. రోజు రోజుకు ఖర్చులు పెరిగి పోతున్నాయని, ఆదాయం గణనీయంగా తగ్గుతోందని, ఈ పరిస్థితుల్లో ఉచిత సేవలు అందించలేమని అంటోంది ఎయిర్ టెల్ కంపెనీ. ఇప్పటికే భారీ మొత్తంలో సదరు కంపెనీ ట్రాయ్ కి డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. ఈ మేరకు అన్ని టెలికాం కంపెనీలు ఒక్క బిఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వ కంపెనీ తప్ప ఎయిర్ టెల్, వోడా ఫోన్ - ఐడియా, రిలయన్స్ జియో కంపెనీలు సైతం దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.
అంతే కాకుండా మొత్తం డబ్బులను కేవలం మూడు నెలల లోపు చెల్లించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిన్నటి దాకా ఆదాయమే మార్గంగా, వినియోగదారులను పీల్చి పిప్పి చేసిన ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ ఇప్పుడు తమ ఆస్తులను అమ్మే పనిలో పడ్డాయి. తమకు కొంత గడువు కావాలని కోరుతున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ కంపెనీ సైతం తన సర్వీసుల్లో ఒక్కో దానిని మూసుకుంటూ వస్తోంది. అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం..అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాయ్ తక్షణమే జోక్యం చేసుకోక పోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు.
ఇటు పెట్టుబడులు అటు వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండింటి మధ్య సమతౌల్యం ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ఎయిర్‌టెల్ క్రమంగా 3జీ సేవలను ఉపసంహరిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. ఇకపై అక్కడ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను.. హై స్పీడ్ 4జీ నెట్‌వర్క్‌పై అందిస్తామని తెలిపింది. ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం 2జీ సేవలు యథాప్రకారం కొనసాగించనున్నట్లు వెల్లడించింది. మొత్తం మీద టెలికాం కంపెనీలు దివాళా తీయకుండా ఉండాలంటే ట్రాయ్ జోక్యం తప్పనిసరి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి