పంత్ గాడిలో పడినట్లేనా

నిన్నటి దాకా అగ్ని పరీక్షను ఎదుర్కుంటున్న రిషబ్ పంత్ గాడిలో పడినట్లేనని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ పంచ్ హిట్టర్ గా పేరొందిన ఈ యువ క్రికెటర్ ఇటీవల ఫార్మ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. తాజాగా రిషబ్ విండీస్ తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ మెరిశాడు. కుదురుగా కాకుండా ధీటుగా పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లతో ఆడుకున్నాడు. ఫామ్ కోల్పోయినా టీమిండియా మేనేజ్ మెంట్ పంత్ ఫెయిల్ అయ్యినా సరే కొనసాగిస్తూ వస్తోంది. రిషబ్ ను మరో ధోనీగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదే సమయంలో నిత్యం సోషల్ మీడియాలో ఉండే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాత్రం పంత్ కు తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని సూచిస్తున్నాడు.  మరింత నిలకడైన ప్రదర్శన చేయాలన్నారు.

అప్పుడడప్పుడు మాత్రమే మెరుస్తున్న పంత్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే విషయంపై దృష్టి పెట్టాలన్నాడు. సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని పంత్‌ నిలబెట్టు కోవాలన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో పంత్‌ 71 పరుగులు సాధించి వన్డే ఫార్మాట్‌లో తన తొలి అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఎంఎస్‌ ధోని ఎంత నిలకడగా జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడేవాడో అదే తరహాలో రాణించడానికి పంత్‌ ట్రై చేయాలన్నాడు. ప్రధానంగా 60 నుంచి 70 పరుగుల వ్యక్తిగత స్కోరును సెంచరీగా మలచుకోవాలి. మేనేజ్ మెంట్ పంత్ పై నమ్మకంతోనే అన్ని ఫార్మాట్లలో అవకాశాలు ఇస్తుంది.

టెస్టు తుది జట్టులో పంత్‌ ఆడనప్పటికీ కనీసం రిజర్వ్‌ ఆటగాడిగానైనా కొనసాగిస్తుంది. అందుకు కారణం పంత్‌పై ఉన్న విపరీతమైన నమ్మకమే కారణం. దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ భారీ సెంచరీలు అవసరం లేదు. ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండటానికి యత్నించాలి అని చెప్పారు. ఎంఎస్‌ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే పంత్‌ ఆకట్టు కున్నప్పటికీ తర్వాత కాలంలో విఫలమై విమర్శల పాలయ్యాడు. వరుస వైఫల్యాల తర్వాత వెస్టిండీస్‌తో మొదటి వన్డేలో పంత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి భాగస్వామ్యాన్ని సాధించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!