నేస్తం నువ్వే సమస్తం - వల్లబదాస్ స్మతిలో..!

పాలమూరు జిల్లా వీరులను కన్నది. అత్యంత ప్రతిభావంతులను చేసింది. ఉద్యమకారులను..పోరాట స్ఫూర్తిని..త్యాగధనులను..విజేతలను..మేధావులను ..తాత్వికులను..గాయనీ గాయకులను..కష్టజీవులను అందించింది. ఈ మట్టిలో పుట్టి..దీనిలోనే తక్కువ కాలంలోనే ఇక సెలవంటూ వెళ్లి పోయాడు..మా వల్లబదాస్ మహేందర్ గౌడ్. మరికల్ మండలం జిన్నారం ఊరులో పుట్టిన మహేందర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మమ్మల్ని వీడి ఇవాళ్టితో ఏడాది గడిచింది. గ్రూప్ -1 ఆఫీసర్ గా అద్భుతమైన నైపుణ్యం, సునిశితమైన తార్కిక విశ్లేషణ, రాయడంలో, చదవడంలో, విశ్లేషించడంలో మా కంటే ఆయన ముందున్నారు. గుండె నిండా ప్రేమను..మానవత్వాన్ని కలిగిన స్నేహితుడు దూరం కావడం బాధాకరం. కాలం ఎంత విచిత్రకరమైన పరిస్థితిని కలుగ చేసిందో తలుచుకుంటేనే కన్నీళ్లు కారి పోతున్నవి. మా ఇద్దరి మధ్య రెండేళ్ల స్నేహం మాత్రమే. కానీ మరిచి పోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సైన్స్, ఐటీ, సోషల్ మీడియా, న్యాయపరమైన ప్రతి రంగంలో ఆయనకు అపరితమైన అనుభవం ఉన్నది. ప్రతి అంశం ...