బ్యాంకులకు ధీటుగా పోస్టాఫీసులు

దేశంలోని ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న రంగాలలో పోస్టల్ శాఖ కూడా ఒకటి. ప్రతి గ్రామానికి పోస్టాఫీసు విస్తరించింది. అత్యధిక వడ్డీని అందిస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది పోస్టాఫీసే. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ శాఖ పూర్తిగా నియమ నిబంధనలకు లోబడే పనిచేస్తోంది. వేలాది మంది దీనిని నమ్ముకుని బతుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డారు. కోట్లాది రూపాయలు ఇందులో పేదలు, మధ్యతరగతి ప్రజలు, పెద్దలు అంతా దీనిలోనే దాచుకున్నారు. డబ్బులు జమ చేస్తే ఇందులో పూర్తి భద్రత ఉంటుందని నమ్మారు. ప్రయోగాత్మకంగా దేశ వ్యాప్తంగా పోస్టల్ శాఖలను బ్యాంకులుగా మార్చారు. ఎలాంటి సేవా రుసుములు ఉండవు. ఎడా పెడా సర్వీసు ఛార్జీలు విధించరు. ఎన్నిసార్లయినా డబ్బులను ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చు. రోజూ వారీగా బ్యాంకులు ఎలా ఖాతాదారులకు సౌకర్యాలు కల్పిస్తాయో ..ఇక్కడి పోస్టల్ బ్యాంకుల్లో లభిస్తాయి. 100 రూపాయల నుండి కోటి రూపాయల దాకా జమ చేసుకోవచ్చు. వ్యక్తిగతంగాను, ఉమ్మడిగాను పోస్టల్ ఖాతా ప్రారంభించవచ్చు. భారీగా విస్తరించిన పోస్టల్ శాఖను ఆధునికర...