బ్యాంకులకు ధీటుగా పోస్టాఫీసులు
దేశంలోని ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న రంగాలలో పోస్టల్ శాఖ కూడా ఒకటి. ప్రతి గ్రామానికి పోస్టాఫీసు విస్తరించింది. అత్యధిక వడ్డీని అందిస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది పోస్టాఫీసే. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ శాఖ పూర్తిగా నియమ నిబంధనలకు లోబడే పనిచేస్తోంది. వేలాది మంది దీనిని నమ్ముకుని బతుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డారు. కోట్లాది రూపాయలు ఇందులో పేదలు, మధ్యతరగతి ప్రజలు, పెద్దలు అంతా దీనిలోనే దాచుకున్నారు. డబ్బులు జమ చేస్తే ఇందులో పూర్తి భద్రత ఉంటుందని నమ్మారు. ప్రయోగాత్మకంగా దేశ వ్యాప్తంగా పోస్టల్ శాఖలను బ్యాంకులుగా మార్చారు. ఎలాంటి సేవా రుసుములు ఉండవు. ఎడా పెడా సర్వీసు ఛార్జీలు విధించరు. ఎన్నిసార్లయినా డబ్బులను ఏటీఎంల ద్వారా డ్రా చేసుకోవచ్చు. రోజూ వారీగా బ్యాంకులు ఎలా ఖాతాదారులకు సౌకర్యాలు కల్పిస్తాయో ..ఇక్కడి పోస్టల్ బ్యాంకుల్లో లభిస్తాయి.
100 రూపాయల నుండి కోటి రూపాయల దాకా జమ చేసుకోవచ్చు. వ్యక్తిగతంగాను, ఉమ్మడిగాను పోస్టల్ ఖాతా ప్రారంభించవచ్చు. భారీగా విస్తరించిన పోస్టల్ శాఖను ఆధునికరించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు అప్పగించారు. ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సొల్యూషన్స్ ద్వారా దేశ వ్యాప్తంగా లక్షా 50 వేల పోస్టాఫీసులను అనుసంధానం చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించు కోవడం వల్ల కంపెనీ, టెక్నాలజీ, సర్వీసులను ఆటోమేట్ చేయొచ్చు. ఎక్కువగా సిబ్బందితో అవసరం లేకుండానే మరింత సులభంగా పనులు చేసుకోవచ్చు. డిజిటలైజేషన్ చేసేందుకు గాను కేంద్ర సర్కార్ టెండర్లను పిలిచింది. చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. కానీ టీసీఎస్ దక్కించుకుంది. 1100 కోట్లకు టెండర్ చేజిక్కించుకుంది టీసీఎస్. ఈ విషయాన్ని అప్పట్లో కంపెనీ ప్రకటించింది.
దీని వల్ల కంప్యూటర్లకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈఆర్‌పీ వల్ల మెయిల్స్ ఆపరేషన్స్, ఫైనాన్స్, అకౌంటింగ్, హెచ్ ఆర్ పనులు మరింత ఈజీ అవుతాయి. మొత్తం పోస్టాఫీసులన్నీ ఒకే నెట్ వర్క్ కిందకు వచ్చాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నెట్ వర్క్‌గా అభివర్ణించింది టీసీఎస్. దీనిని వాడడం వల్ల అటు ఉద్యోగులకు ఇటు ఖాతాదారులకు మరింత మేలు జరగనుంది. 24 వేల పోస్టాఫీసుల్లో 80 వేల పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు. కన్ సైన్ మెంట్ ట్రాకింగ్ సదుపాయం ఉన్న వెబ్ పోర్టల్‌ను డెవలప్ చేసింది. కష్టమర్ల అనుమానాలను నివృత్తి చేసేందుకు వివిధ భాషల్లో కాల్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్‌మ్యాన్‌లు ప్రజల వద్దకు వెళ్లి పోస్టల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాష్ మేనేజ్‌మెంట్ సేవలు అందించేందుకు దర్పణ్ హ్యాండ్ డివైసెస్ ఇచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి