చదువులో లాస్ట్ - క్రికెట్‌లో బెస్ట్ - సచిన్ బర్త్ డే
ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న అరుదైన ఆటగాడు సచిన్ రమేష్ టెండూల్కర్. ముంబయికి చెందిన ఈ ఆటగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. రికార్డులను తిరగ రాశాడు. కొత్త రికార్డులు నమోదు చేశాడు. క్రికెట్ ఆటలో ఉన్న అన్ని ఫార్మాట్‌లలో ఆడిన ఘనత ఆయనదే. సచిన్ వ్యక్తి కాదు..ఓ వ్యవస్థ. ఓ బ్రాండ్. ఓ నమ్మకం. ఓ స్ఫూర్తి. ఆదర్శం కూడా. గురువు నేర్పిన పాఠాలను వంట పట్టించుకుని భారతీయుడిగా ఎనలేని పరుగులు సాధించాడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. కేవలం పది వరకే పాసైనా..ఇంటర్ పూర్తి చేయలేక పోయినా క్రికెట్‌లో లెజెండ్‌గా పిలిచేలా చేసుకున్నాడు. మోస్ట్ ఫెవరబుల్ క్రికెటర్‌గా సచిన్‌కు పేరుంది. 10 వేలకు పైగా పరుగులు సాధించాడు. అటు వన్డేల్లోను..ఇటు టెస్ట్ క్రికెట్‌లోను సచిన్ టన్నుల కొద్దీ పరుగుల వరద పారించాడు. క్రీజులో ఉన్నాడంటే సెంచరీ చేయాల్సిందే . అంతగా పాతుకు పోయాడు. మైదానం నలుమూలలా ఆడడం ఆయనకే చెల్లింది.
మరో క్రికెట్ దిగ్గజం ..మణికట్టు మాంత్రికుడు మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే సచిన్ మెరిశాడు. ఎక్కువగా ఆడేందుకు సపోర్ట్ ఇచ్చాడు. కానీ సచిన్ మాత్రం అజార్‌కు అంతగా మద్ధతు ఇచ్చినట్టు దాఖలాలు లేవు. వ్యక్తిగతంగా తన స్కోర్ పెరిగేందుకే ప్రయత్నం చేశాడే తప్పా జట్టు విజయం కోసం కష్టపడింది లేదన్న విమర్శలున్నాయి. ఏప్రిల్ 24న జన్మించిన సచిన్. ఎక్కని ఎత్తు పల్లాలంటూ ఏవీ లేవు. 16 నవంబర్ 2013లో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు సచిన్. ప్రపంచం నివ్వెర పోయింది. అయినా తన నిర్ణయం మార్చు కోలేదు. భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది. ఈ అవార్డును పొందిన మొదటి క్రికెటర్ ఇతడే.
ఇండియాలో క్రికెట్ జనాదరణ పెంపొందడంలో కపిల్‌దేవ్, అజారుద్దీన్, సచిన్‌లు కీలక పాత్ర పోషించారు. 1990 దశకంలో ఇండియన్ క్రికెట్‌లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను సమ్మోహితులను చేశాడు సచిన్. ఇండియాకు ఎన్నో విజయాలు తెచ్చి పెట్టాడు. 2002లో విజ్డన్ పత్రిక టెస్ట్ క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మెన్, వన్డేలో వెస్ట్ ఇండీస్ కు చెందిన రిచర్డ్స్, ఇండియాకు చెందిన సచిన్‌ను ఎంపిక చేసింది. క్రీడా ప్రపంచంలోనే అత్యున్నతమైన బ్యాట్స్‌మెన్‌గా ప్రకటించింది. 2003లో రిచర్డ్స్‌ను కాదని సచిన్ నిలబడ్డాడు. టెస్ట్ రికార్డుల్లో, వన్డే రికార్డుల్లో సచిన్ పేరు మొదటగా కనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు ఆయన స్వంతమయ్యాయి. 17 అక్టోబర్ 2008న బ్రయాన్ లారాను అధిగమించి మొదటి స్థానం పొందాడు.
వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు కూడా సచిన్ మీదే నమోదైంది. లిటిల్ మాస్టర్‌గా ముద్దుగా పిలుచుకునే ఈ క్రికెటర్ 1989లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 200 పరుగులు సాధించిన సచిన్ మొట్ట మొదటి ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు. డిసెంబర్ 19న జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 50వ సెంచరీ పూర్తి చేశాడు. 2012లో వన్డేలు, టెస్ట్‌లు కలిపి 100 సెంచరీలు పూర్తిచేశాడు. తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాతో సచిన్ మెళకువలు నేర్చుకున్నాడు. లిల్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు అని సూచించారు. అదే అతడిని మార్చేసింది. పాఠశాలలో ఉన్నప్పుడు కాంబ్లితో కలిసి 1988లో 644 పరుగులు ఇద్దరూ కలిసి చేశారు. 320 పరుగులు చేశాడు సచిన్. 189లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరపున ఆడాడు. గుజరాత్‌పై జరిగిన పోటీలో వంద పరుగులు చేశాడు. 15 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు. రంజీ, దులీప్, ఇరానీ ట్రోఫీలలో ఆడిన మొదటి మ్యాచ్‌ల్లోనే సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు.
టెండూల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్‌పై ఆడాడు. 15 పరుగులకే వకార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఫైసలాబాద్‌లో తన తొలి అర్థశతకం పూర్తి చేశాడు. న్యూజిలాండ్ టూర్‌లో రెండో టెస్టులో 88 పరుగులు చేశాడు. 1990లో ఇంగ్లండ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలి సెంచరీ చేశాడు. 1991-1992లో ఆస్ట్రేలియా టూర్‌లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. సిడ్నీ మ్యాచ్‌లో 148 పరుగులు చేశాడు. పెర్త్ లో మరో సెంచరీ కొట్టాడు. 1994లో సచిన్‌ను ఓపెనర్‌గా పంపించారు. 82 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై తొలి వన్డే సెంచరీ చేశాడు. 1996 ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2 సెంచరీలు కొట్టాడు. 1998లో ఆస్ట్రేలియాపై వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ టెండుల్కర్ మృతి చెందారు.
తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అజహరుద్దీన్ నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత 2000లో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ ఇవ్వబడింది. 2003 ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చాడు. కాని ఈసారి కూడా ఆస్ట్రేలియానే విజయం వరించింది. అయినా మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ నే వరించింది.
2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు. డిసెంబర్ 10, 2005 న ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక పై ఆడుతూ 35 వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. జనవరి 2007లో వెస్ట్ఇండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో 76 బంతుల్లో సెంచరీ సాధించి తన 41 శతకాన్ని పూర్తిచేసి రెండో స్థానంలో ఉన్న సనత్ జయసూర్య కంటే 17 శతకాలు ఆధిక్యంలో ఉండి తిరుగు లేదనిపించుకున్నాడు. వెస్ట్ఇండీస్ లో జరిగిన 2007 ప్రపంచ కప్ లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో లోయర్ ఆర్డర్ బ్యాంటింగ్ చేసి పేలవమైన్ స్కోరు సాధించాడు. బంగ్లాదేశ్ పై 7 పరుగులు, బెర్ముడా పై 57 పరుగులు, శ్రీలంక పై సున్నా పరుగులు చేసాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సచిన్ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని ముంబాయికి చెందిన మధ్యాహ్న పత్రికలో కాలమ్ రాసి సంచలనం సృష్టించాడు.
ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పొంది విమర్శకులకు నోళ్ళు మూయించాడు. నాటింఘమ్ టెస్టు రెండో రోజున సచిన్ టెస్ట్ క్రికెట్ లో 11000 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరీస్ లో 278 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా నిల్చాడు. 1997లో విజ్డెన్ పత్రిక సచిన్ ను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. 1994, 1996, 1997, 1998, 2000, 2003 మరియు 2007 వన్డేలలో వేయి పరుగులు చేశాడు. 1998లో జరిగిన వన్డేలలో 1,894 పరుగులు సాధించాడు. మొత్తం 23 సార్లు 90 -100 మధ్య స్కోరులో అవుటయ్యాడు. 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 50 వ సెంచరీ చేసి..రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌పై 100వ సెంచరీ నెలకొల్పాడు సచిన్. క్రికెట్ అంటేనే సచిన్. సచిన్ అంటేనే క్రికెట్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి