ఆర్టీసీ సమ్మె పై కేంద్రం ఆరా..ఢిల్లీకి తమిళిసై

తెలంగాణాలో ఒక్కసారిగా రాజకీయాలు వెదికాయి. పరిణామాలు ఊహించని రీతిలో మారిపోతున్నాయి. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఇదే సమయంలో కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఇద్దరు కార్మికులు తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. పరిస్థితి చేయి దాటిపోతున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రావడం లేదు. మరో వైపు టీఅర్ఎస్ సీనియర్ నాయకుడు కేశవరావు కార్మికుల డిమాండ్లను కేసీఆర్ సానుభూతితో పరిశీలించాలని కోరారు. కోర్టు ఏం చెప్పబోతుందో నని ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం ఆత్రుతతో ఎదురు చూస్తోంది. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కంటికి గాయం కావడం, బీజేపీ కేంద్ర ప్రెసిడెంట్ నడ్డా ఫోన్ చేయడం జరిగింది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆందోళన, పోలీసుల అరెస్టులు, కేసుల నమోదు, విపక్షాల మద్దతు, ప్రైవేట్ బస్సుల కొనుగోలు వ్యవహారంపై పూర్తి నివేదికను ఎప్పటికప్పుడు కేంద్రం తెప్పించుకుంటోంది. ఇదిలా ఉండగా అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోనూ చేపడుతున్న ప్రాజెక్టులలో మేఘా కృష్ణారెడ్డి చేతి వాటం ఉందని, ఇందులో కేసీఆర్ కుటుంబం లబ్ది ప...