జగన్ ను కలిసిన మెగాస్టార్

ఏపీ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ నటుడు చిరంజీవి సీఎం నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా చిరంజీవి దంపతులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం చిరజీవి వెంట ఆయన సతీమణి సురేఖ తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కూడా ఉన్నారు. కాగా జగన్ నివాసానికి వెళ్లిన మెగాస్టార్ దంపతులకు జగన్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం చిరంజీవి జగన్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. చిరు భార్య సురేఖ జగన్ భార్యకు చీరను అందజేశారు. చిరంజీవి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లు భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది.

ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఐదు నెలలు గడిచినా ఈరోజు వరకు టాలీవుడ్ నుండి నటీనటులు కలవ లేదు. దీనిపై శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, నటుడు పృథ్వీ రాజ్ మండిపడ్డారు. ఇదే సమయంలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా లతో కలిసి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహ్మ రెడ్డి జీవితం ఆధారంగా సైరా సినిమా తీశారు. దీనిని చిరంజీవి కొడుకు, నటుడు రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది. భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో తన 151 వ సినిమా ఊహించని రీతిలో సక్సెస్ కావడంతో చిరు ఫ్యామిలిలో సంతోషం వ్యక్తమవుతోంది.

ఇదే సమయంలో టీఎస్ గవర్నర్ తమిళసి ని చిరు కలిసి సైరా సినిమాను చూడాలని కోరారు. సైరా సినిమా బాగుందని ప్రశంసించారు. మరో వైపు సైరా సినిమా విడుదల సమయంలో ఎక్కువ షో లు నడిపేలా జగన్ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఏపీలో అనుకోని రీతిలో స్పందన లభించింది. సైరా సినిమాను చూడాలని మెగాస్టార్ జగన్ ను కోరారు. ఇదే క్రమంలో చిరంజీవి జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఎంతో ప్రాముఖ్యతను కలిగించింది. తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ పై ప్రతి రోజు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే టాలీవుడ్ ను హైదరాబాద్ లో కాకుండా వైజాగ్ లో ఏర్పాటు చేసేలా చూడాలని చిరు కోరినట్లు సమాచారం. మొత్తం మీద వీరిద్దరి భేటీ అటు రాజకీయ ..సినీ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. 

కామెంట్‌లు