సయోధ్య కుదిరేనా..సమ్మె నిలిచేనా
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మరింత ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఇప్పటికే ఓ డ్రైవర్ తో పాటు మరో కండక్టర్ బలిదానం చేసుకున్నారు. దీంతో తెలంగాణాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. డిపోల వద్ద కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. వంటా వార్పూ, బైక్ ర్యాలీ చేపట్టారు. ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు దాడులకు దిగారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల చావులు ముమ్మాటికీ సర్కార్ హత్యలేనని నాయకులు ఆరోపించారు. సీఎం తో పాటు మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఉన్నట్టుండి అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కేశవరావు ఓ ప్రకటన చేశారు.
వెంటనే సమ్మె విరమించాలని, కార్మికుల డిమాండ్లను సానుభూతితో సీఎం కేసీఆర్ పరిశీలించాలని కోరారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం పేర్కొనడంపై తెలంగాణ అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఉద్యమంలో పాల్గొనని వారు తమపై ఆరోపణలు చేసే హక్కు లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి. రాజి రెడ్డి. థామస్ రెడ్డి లు స్పష్టం చేశారు. అంతటా ప్రభుత్వానికి వ్యతిరేకత రావడంతో కొంత మెట్టు దిగినట్టు అనిపిస్తోంది. కార్మికులు..సర్కార్ మధ్య సయోధ్యకు పెద్దాయన కేకేను కేసీఆర్ పురమాయించినట్టు సమాచారం. ఢిల్లీ లో ఉన్న కేకే హైదరాబాద్ కు వచ్చారు. అయితే కార్మికులు సమ్మె విరమించి వస్తే చర్చలకు సిద్ధమన్నారు కేకే. సమ్మెలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను ఎంతో బాధించిందని, ఏ సమస్యకూ ఆత్మాహుతి లేదా ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ మినహా సంస్థ ఉద్యోగులు లేవనెత్తిన ఇతర అంశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరించరాదనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. అలాంటి నిర్ణయాలు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు కేకే. ఇదిలా ఉండగా టిజెఎసి ఉద్యోగ సంఘాల నాయకులూ మాట మార్చారు. నిన్నటి దాకా సర్కార్ వంత పాడిన వీరిపై తీవ్ర వత్తిళ్లు రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు జరుపుతామంటే తాము సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు వెల్లడించారు. హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై కీలక తీర్పు ఇవ్వనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి