కార్మికుల కోసం సకల జనం

తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉధృతంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో గతంలో ఆర్టీసీ కార్మికులు అగ్ర భాగాన నిలిచారు. ఇప్పటికే డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ గౌడ్ లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు నిరసన తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాక పోగా, పైపెచ్చు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం చెప్పడంపై తెలంగాణ అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కార్మికుల కోసం అన్ని వర్గాల నుంచి సంఘీభావం ప్రకటించారు.

తక్షణమే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు న్యాయవాదులు. అయితే తెలంగాణ అంతటా పోలీసులు మోహరించారు. చాలా చోట్ల ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడ్డారు. దీనిపై విపక్షాలు, ఆయా సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు ఖండించారు. ఇదిలా ఉండగా కార్మికులు చని పోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వెంటనే సీఎం, మంత్రులపై కేసులు నమోదు చేయాలనీ బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, కోదండరాం, రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, సంధ్య డిమాండ్ చేశారు. మరో వైపు ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళశై ని కలిసి సమ్మె చేసేందుకు గల కారణాలను, ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న దమనకాండ గురించి తెలియచేశారు. ఇక సమ్మెపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

దీనిపై కోర్టు కొన్ని గంటల్లో కీలక తీర్పు ఇవ్వనుంది. ఇదిలా ఉండగా తెలంగాణలోని పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనిపై ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సకల జనులంతా కార్మికుల కోసం కదులుతోంది. దీంతో పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన అధికార పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావు చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొండి పట్టు వీడాలని, కార్మికుల పట్ల కొంత సహృదయతను చాటు కోవాలని మేధావులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే 60000 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులపై సీఎం కుటుంబం కన్నేసిందని, తమ అనుయాయులకు కట్టబెట్టిందిని అందుకే సంస్థను ప్రైవేట్ పరం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారంటూ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!