ఆ రోజులు మరిచి పోలేం..ఈ రోజుల్లో బతకలేం

ఇప్ప‌టికీ పుస్త‌కం చ‌ద‌వ‌కుండా ..రాయ‌కుండా వుండ‌లేను. వంద‌ల పుస్త‌కాలు. లెక్క‌లేన‌న్ని. వాటిలో కొన్ని ఆలోచింప చేస్తే..మ‌రికొన్ని గుండెల్లో దాచుకునేలా చేశాయి. నేను లేకుండా వుండ‌గ‌ల‌వా ..అని అప్పుడెప్పుడో అడిగింది..భార్య‌..ఉండ‌గ‌ల‌ను..కానీ పుస్త‌కాలు లేకుండా నేనుండ‌లేన‌న్నా..కొన్ని రోజులు మాట‌లు బంద్..పెళ్లి క‌దా. అదో బంధం..అంతులేని సంబంధం. ఆ కాస్తా ఇద్ద‌రి మ‌ధ్య ఆక‌ర్ష‌ణ అన్న‌ది లేక‌పోతే ఇంత‌లా ..అల్లుకు పోవ‌డాలు..ఆవేశ‌కావేశాలు..ఆలోచ‌న‌ల..క‌ల‌బోత‌లు..అల‌క‌లు..ప‌ల‌క‌రింత‌లు..చూపులు..మ‌ళ్లీ మాట్లాడుకోవ‌టాలు..ఇదేగా కుటుంబాలు బ‌లంగా వుండేందుకు దోహ‌ద ప‌డుతున్నాయి. ప‌దిలోనే దాస్ కేపిట‌ల్ చ‌దివాక‌..అదేదో ప్ర‌పంచాన్ని జ‌యించినంత ఆనందం. ఊళ్లో ప‌కీర్లు..నాట‌కాలు వేసే వాళ్లను చూస్తే ప్రేమ‌. సంత‌లు, జాత‌ర్లలో డ్రామాలు. క‌ర్నూలు నుండి ర‌జ‌నీబాయి వ‌స్తుందంటే జ‌నం విర‌గ‌డి వాలేవారు. ఇపుడు లెక్క‌లేనంత మంది జ‌నం.

అంద‌రూ న‌టులే..న‌టీమ‌ణులే. ప్ర‌తిభ‌తో ఏం ప‌ని. టెక్నాల‌జి పెరిగింది క‌దా.. మ‌న శ‌రీరం ఒక్క‌టి అప్ప‌గిస్తే చాలు..అన్నీ అందుబాటులో దొరుకుతాయి. మ‌నం కాకుండా పోతామంతే.. కాలం మారంద‌ని అనుకున్నా..ఏమీ లేదు అది త‌నంతట తాను ప్ర‌యాణం చేస్తూనే వున్న‌ది. మారింది కాలం కాదు..నేను. బ‌త‌క‌డానికి ఏం కావాలి. తిండి..కానీ చాలా మందికి అదో పేష‌న్. అదో స్టేట‌స్ సింబ‌ల్. అదో ఆధిప‌త్య‌పు ఆరాటం. చెప్ప‌లేనంత ..చెప్పుకోలేనంత ఆజ‌మాయిషీ. గుళ్లు..బ‌డులు రెండూ స‌మ‌పాళ్ల‌లో ఆద‌రించేవి. అక్క‌డ రోజూ దీపాలు వెలిగితే..ఇక్క‌డ ఠంఛ‌నుగా మా సాహెబు నూక‌ల‌తో చేసిన వేడి వేడి ఉప్మా వ‌డ్డించేటోడు. ఆ కాలం పోయింది. ఇపుడు కాంట్రాక్ట‌ర్లు..బ్రోక‌ర్లు..పంతుళ్లంటే చ‌చ్చేంత భ‌యం. ప‌ద్యం అప్ప‌చెప్ప‌క పోతే ఆరోజంతా జాగ‌ర‌ణే. రెండు కాళ్ల‌పై దెబ్బ‌లే. అదో న‌ర‌కం..అపుడే బావుండేది..ప‌రీక్ష‌లంటే భ‌యం..టీచ‌ర్లంటే కోపం కూడా..కానీ బ‌డిలో కొట్టినా..తిట్టినా..కోప్ప‌డినా..కొద్ది సేపే..గంట కొట్టాక‌..త‌ర‌గ‌తుల‌న్నీ అయిపోయాక ..అంతా మామూలే. చేతిలో పుస్త‌కం వుంటే అదో గౌర‌వం. ఎక్క‌డలేనంత ఆనందం. యెద పొంగేది.

గ‌త 35 ఏళ్లుగా చేతిలో పుస్త‌కం లేకుండా ..ప‌త్రిక లేకుండా ఉండ‌లేదు. పైస‌ల‌కే రెడ్డి బీడీలు..చార్మినార్ సిగ‌రెట్లు, టోప‌జ్ బ్లేడ్లు దొరికేవి. చాక్ పీసులు, పుస్త‌కాలు, నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు అన్నీ త‌క్కువ ధ‌ర‌కే వుండేవి. బ్రిటానియా చాక్లెట్లు అంగ‌ట్లో అమ్మేటొళ్లు. ఎద్దులు,
బ‌ళ్లు..గుళ్లు..గోపురాలు..పిల్ల‌లు..కేరింత‌లు..వాగులు..వంక‌లు ..అన్నీ ఒక్క‌టే.. సాయంత్ర‌మైతే చాలు ఊరు ప‌క్క‌నే రోడ్డు..దాని ప‌క్క‌నే గ్రౌండ్.. క‌బ‌డ్డీ, వాలీబాల్, బ్యాడ్మింట‌న్ , చెస్ , రింగ్ బాల్ ఆడేవాళ్లు. ఆ ప‌క్క‌నే తాగినంత ఛాయ్ . రేష‌న్ షాపు ఒక్క‌టే. ఊరి జ‌న‌మంతా అక్క‌డే. అదో కోలాటం. శ్రీ‌రామ న‌వమి వ‌స్తే చాలు..ఊరొళ్లంద‌రికీ శ‌న‌గ‌బ్యాళ్ల‌తో ప‌ర‌మాన్నం, పులిహోర , చిత్రాన్నం దొరికేది. కాలంటే కంటే వేగంగా టెక్నాల‌జీ మారింది. ఎన్నో మార్పులు. ఊహించ‌లేనంత అభివృద్ధి. దేశాల మ‌ధ్య అంత‌రాలు తొల‌గి పోయాయి. కులాలు, మ‌తాలు, బంధాలు అన్నీ ఒకే ప్లాట్ ఫాం మీద‌కు వ‌చ్చాయి. ఏళ్లు గ‌డిచి పోయినా ఎన్ని మారినా డాల‌ర్ మాత్రం త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. ఒక‌ప్పుడు బ‌త‌కాలంటే బ‌రువే..భార‌మే..ఇబ్బందిగా ఫీల‌య్యే వాలం. ఎన్ని ప్ర‌య‌త్నాలు..ఎన్నో క‌ష్టాలు..ఇపుడ‌లా లేదు. ఐడియా వుంటే..స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే..జీయో ఉందిగా ..ఇంకేం నీకు నీవే బాస్.

కొద్దిగా క‌ష్ట‌ప‌డితే క‌రోడ్‌ప‌తి అయిపోవ‌చ్చు. మాకేమో విలువ‌లు నేర్పారు. అదే చ‌ట్రంలో ప‌డి కొట్టుకుపోతూ..అటు ఇముడ‌లేక‌..ఇటు స‌ర్దుకోలేక‌..ఆశ్ర‌మాలే బెట‌ర్ అనే స్థాయికి వ‌చ్చేశాం. వెన‌క్కి చూసుకుంటే ఏమున్న‌ది. అంతా ఖాళీనే..నీకో బ్యాంకు ఖాతా ఉందా .. పోనీ నీ కోటాలో క‌నీసం ఓ ఎక‌రం పొల‌మైనా ఉన్న‌దా..ఏం బాస్ ..ఓ భార్య‌..ఓ కొడుకు..ఏమీ లేక‌పోతే ఎట్లా. అన్న ప్ర‌శ్న‌. ప్ర‌తిసారి త‌లుచుకున్న‌ప్పుడ‌ల్లా..పాట‌ల్ని విన‌డం..కామెడీ చూడ‌టం..పుస్త‌కాల వైపు చూడ‌టం. ఎన్ని పుస్త‌కాలు చ‌దివినా ఏదో వెలితి. అంతా క‌రెన్సీనే క‌దూ. ఏం చేయ‌గ‌లం. వాటిని ప‌ట్టుకోవాల‌న్నా..లెక్క పెట్టాల‌న్నా ..ఎల‌ర్జీ. య‌వ్వ‌న కాలంలో డ‌బ్బంటే చేదు. ద్వేషం. అదో ఉన్నోళ్ల‌కు మాత్ర‌మే చెందింద‌నే ఆలోచ‌న‌. ఇపుడు తెలిసొస్తోంది చూస్తే కాగితం కానీ అది లేక‌పోతే మ‌నిషే లేడ‌ని. మొన్న ఆస్ప‌త్రికి వెళితే..పైస‌లిస్త‌నే డాక్ట‌ర్ చేయి ప‌ట్టుకున్న‌డు. అప్పుడు అనిపించింది. స్నేహ‌మేరా జీవితం..కుటుంబ‌మే బ‌లం అన్నీ ట్రాష్. జ‌స్ట్ కాసులుంటే చాలు..లైఫ్ ను ఈజీగా బ‌తికేయొచ్చ‌ని. కానీ శ‌రీరం స‌హ‌క‌రిస్తేగా..నిస్స‌త్తువ ఆవ‌హించిన‌ప్పుడ‌ల్లా మార్స్కిజం కంటే యుండ‌మూరి రాసిన పుస్త‌కాలే కాసింత బ‌లాన్ని ఇస్తున్నాయి.

ఎన్ని చ‌దివినా ఏం లాభం. ఎలా సంపాదించాలో చెప్ప‌రు ఈ ర‌చ‌యిత‌లు. మాన‌వ సంబంధాలే ఆర్థిక సంబంధాల‌న్న మ‌హానుభావుడు ..ఇపుడుంటే ఇముడ‌లేక పోయేవాడు. ఎంత‌లా అంటే ఏమీ లేక పోవ‌డంలో ఉన్నంత ఫీలింగ్ ఉన్న‌వాటితో ఏం క‌లుగుతుంది క‌నుక‌..అప్పుడు క‌ష్ట‌ప‌డ‌ట‌మే..కానీ కాసులు దొరికేవి కాదు..ఇపుడు విస్తార‌మైన ప్ర‌పంచం. లెక్క‌లేనంత డ‌బ్బు..కొల్ల‌గొట్ట‌డ‌మే త‌రువాయి. ఆంట్రప్రెన్యూర్లు, స్టార్ట‌ప్‌లు..లెక్క‌లేన‌న్ని కంపెనీలు..సంస్థ‌లు పుట్టుకొస్తున్నాయి. కోట్లు వెన‌కేసుకుంటున్నాయి. జీవితం ఇక చాల‌నుకున్న‌ప్పుడు..నిరాశ ఆవ‌హించిన‌ప్పుడు..న‌న్ను నేను చూసుకోవ‌డానికి ..బాగా ప‌నికొచ్చేది ఏదైనా ఉందంటే అది పుస్త‌కం మాత్ర‌మే. వంద‌ల కొద్దీ పుస్త‌కాలున్నా ఎప్పుడూ గుర్తుకు వ‌చ్చేది..చ‌ద‌వాల‌ని అనిపించేది మాత్రం యుండ‌మూరి రాసిన డ‌బ్బు టు ది ప‌వ‌ర్ ఆఫ్ డ‌బ్బు..పుస్త‌కమే.

ఇటీవ‌ల గాలిమోట‌రు ఎక్కిన‌ప్పుడు..ఫ్ల‌యిట్ అటూ ఇటూ క‌దిలిన‌ప్పుడు..ఛాలెంజ్ సినిమా గుర్తొచ్చింది. ఐదేళ్ల‌లో ల‌క్ష‌లు సంపాదించ‌డం అంత పెద్ద క‌ష్ట‌మైన ప‌నేం కాద‌ని. ఎందుకంటే ..కిటికీ ప‌క్క‌న చూస్తే ఏముంది..మేఘాలు..కానీ చేతిలో న‌న్ను తాకుతోంది మాత్రం పుస్త‌క‌మే. ఒక‌మ్మాయి తండ్రితో పందెం క‌ట్టిన యువ‌కుడి క‌థ‌. మాన‌సిక స్థ‌యిర్యాన్ని..అద్బుత‌మైన శ‌క్తిని ఇచ్చే ఒకే ఒక్క సాధ‌నం ఈ పుస్త‌క‌మే. న‌న్ను మ‌నిషిని చేసింది..కావాల్సినంత జోష్ నింపేలా చేసింది...ఇదే..ఒక‌టా రెండా ..వంద‌ల సార్లు ఆ పుస్త‌కం నాతోనే ఉండి పోయింది. న్యాయమూ..చ‌ట్టానికి మ‌ధ్య వున్న తేడా..డ‌బ్బు సంపాదించ‌డంలో మెళ‌కువ‌లు..స్పాంటేనియ‌స్ గా కాకుండా కేవ‌లం నిజాయితీగా ..మోసానికి పాల్ప‌డ‌కుండా డ‌బ్బులు ఎలా వెన‌కేసుకోవ‌చ్చో తెలియ చెప్పిన తీరు గొప్ప‌గా వుంటుంది.

ల‌క్ష‌లాది మందికి ప్రేర‌ణ‌గా..ఎంతో మంది బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్‌కు చోద‌క శ‌క్తిగా..వ‌ర్ధ‌మాన యువ‌తీ యువ‌కుల‌కు..పుస్త‌క ప్రేమికుల‌కు టానిక్‌గా ప‌నిచేసింది. చిరంజీవి ఛాలెంజ్ సినిమాగా వ‌చ్చింది. కానీ మూవీ కంటే..ఆద్యంత‌మూ విడ‌వ‌కుండా చ‌దివించే ర‌చ‌యిత శైలీ విన్యాసం మ‌న‌ల్ని క‌ట్టి ప‌డేస్తుంది..ఎంత‌గా ఆలోచించినా..మ‌న‌సు అనేది ఒక చోట వుంటేగా..ఎక్క‌డికో ప‌రుగులు తీయాల‌ని కోరిక‌..రైలు వెళుతున్న‌ప్పుడు..బ‌స్సులో కూర్చున్న‌పుడు..విమానంలో సీటు బెల్టు పెట్టుకుంటున్న‌ప్పుడు..కిటికీ ప‌క్క‌న కూర్చుంటే...పుస్త‌కం చ‌దువుతూ ..పాట‌లు వింటూ ప్ర‌యాణం చేయ‌డం చెప్ప‌లేనంత హాయి. కేవ‌లం వంద రూపాయ‌ల లోపు వుండే ఈ పుస్త‌కం ఎక్క‌డైనా దొరుకుతుంది..వీలైతే చ‌ద‌వండి..ప‌దేళ్ల‌కు కావాల్సినంత ఎనర్జీ దొరుకుతుంది..అయినా ..ఎంత నేర్చినా..ఎంత‌గా ఆలోచించినా..ఎంత సంపాదించినా..ఆ రోజులే బాగుండేవి..అపుడే బావుండేది..క‌దూ..!

కామెంట్‌లు