అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి

ఆర్థిక శాస్త్రంలో విశిష్టమైన సేవలందించిన ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి వరించింది. 2019 సంవత్సరానికి గానూ అభిజిత్‌ బెనర్జీ, ఎస్తేర్‌ డుఫ్లో, మైఖేల్‌ క్రెమేర్‌లను నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ప్రకటించింది. అంతకు ముందు ఇండియాకు చెందిన అమర్థ్యాసేన్‌ కు ఆర్థిక శాస్త్రం లో నోబెల్ దక్కింది. ఆయన తర్వాత నోబెల్ బహుమతి పొందిన వాడిగా ప్రవాస భారతీయుడు, మేధావి, ఆర్ధిక వేత్త అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం లభించింది. ఆర్ధిక రంగంలో ఎదురవవుతున్న సవాళ్లు, ప్రపంచ పేదరికాన్ని తొలగించేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు ఎంతగానో కృషి చేశారు. ఈ మేరకు అభిజిత్ చరిత్ర సృష్టించారు. అభిజిత్‌ బెనెర్జీ బెంగాల్ లో జన్మించారు.

మేధావిగా, స్కాలర్ గా బెనర్జీ పేరు పొందారు. 2011 లో ఎఫ్టీ గోల్డ్ మాన్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారు. 1961 ఫిబ్రవరి 21 న పుట్టారు. ఆయనకు ఇప్పుడు 58 ఏళ్ళు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ, కోల్ కత్తా లోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, ఫీల్డ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్ విభాగంలో పని చేశారు. జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో పని చేశారు. ఎకనామిక్స్ లో డాక్టరేట్ అందుకున్నారు. డీన్ గా అభిజిత్ పనిచేశారు. ఎకనామిక్ సైన్సెస్ లో ఎనలేని కృషి చేసినందుకు ఎంపిక చేశారు. పేదరికం, దాని ప్రభావం,  నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి అభిజిత్ ఎన్నో సూచనలు చేశారు.

ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ గా పని చేశారు. అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ ను అభిజిత్ బెనర్జీ స్థాపించారు. ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ పావర్టీ పేరుతో రీసర్చ్ పత్రాలు సమర్పించారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ఫెల్లో గా పని చేశారు. అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో ఫెలో గా అభిజిత్ ఉన్నారు. పూర్ ఎకనామిక్స్ పేరుతో ఆర్ధిక అంశాలపై అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. కాగా భారతీయుడైన అభిజిత్ బెనర్జీఐకి నోబెల్ బహుమతి దక్కడంపై భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!