ఆగని సమ్మె..దిగని సర్కార్
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. ఎట్టి పరిస్థితుల్లో తమ ఆందోళనను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు. ప్రభుత్వం తరపున ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా ఖమ్మం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి మృతి చెందాడు. అయన కుటుంబం పై పోలీసులు వత్తిడి తీసుకు వచ్చి అంత్యక్రియలు జరిపించారు. 48 వేల మంది కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. మరో వైపు హైదరాబాద్ లో మరో ఆర్టీసీ కార్మికుడు కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీంతో సమస్య మరింత తీవ్రతరమైంది. తక్షణమే పరిష్కరించాలని, కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్ధి నాయకులు డిమాండ్ చేశారు. అంతకు ముందు ఓయూలో ధర్నా చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించారు. వీరికి మద్దతును ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో తెలంగాణాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించాయి. సమ్మె ప్రభావంతో ప్రభుత్వం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను విద్యా సంస్థలకు సెలవులు పొడిగించింది. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను మరోసారి పరిశీలించాలని టీఆరెఎస్ సీనియర్ నేత కేశవరావు కోరారు.
ఇంకో వైపు కార్మికులను సంఘాల నాయకులు, విపక్షాలు రెచ్చ గొడుతున్నాయని మంత్రులు పువ్వాడ, తలసాని ఆరోపించారు. దీనిని అశ్వత్థామ రెడ్డి ఖండించారు. ఉద్యమంలో లేని నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. తాము తగ్గబోమని స్పష్టం చేశారు. అంతకు ముందు ఆర్టీసీ జేఏసీ నాయకులు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలిశారు. కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిరంకుశ ధోరణి గురించి చెప్పారు. కార్మికుల బలిదానాలు ముమ్మాటికీ సర్కార్ హత్యలేనని కోదండరాం, లక్ష్మణ్, రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదిలా ఉండగా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ సైతం కార్మికులకు మద్దతు ప్రకటిచారు. మొత్తం మీద కార్మికులు మెట్టు దిగమంటుంటే ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఇదిలా ఉండగా కొన్ని గంటల్లో హైకోర్టు సమ్మెపై కీలక తీర్పు ఇవ్వనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి