టీఆర్ఎస్ కు షాకిచ్చిన సీపీఐ
తెలంగాణలో అధికార పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం లేదంటూ సీపీఐ వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులు గత పది రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగారు. ఇదే సమయంలో ఆర్టీసీ సంస్థలో వందలాది కార్మికులు సీపీఐ పార్టీకి అనుబంధంగా కార్మిక సంస్థగా ఉన్నది. దీనికి కార్మిక శాఖ గుర్తింపు కూడా ఉంది. దీంతో కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వత్తిళ్లు వచ్చాయి. కార్మికులు చేస్తున్న పోరాటం, ఆందోళన న్యాయబద్ధమైనది కావడంతో అన్ని పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు పూర్తి మద్దతు ప్రకటించారు. అంతకు ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, థామస్ రెడ్డి, రాజి రెడ్డిలు అన్ని పార్టీల అధినేతల వద్దకు వెళ్లారు.
తాము చేస్తున్న శాంతియుత ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలతో కలిసి అఖిల పక్షం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కోదండ రామ్, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, లక్ష్మణ్, మంద కృష్ణ మాదిగ, తదితరులు పాల్గొన్నారు. బేషరతుగా కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయవద్దని కోరారు. ఇదే సమయంలో సీఎం కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, వారిని విధుల్లోకి తీసుకోమని, కొత్త బస్సులతో పాటు కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో కార్మికులు ఒక్కసారిగా సీఎం ప్రకటనపై ఆగ్రహం చెందారు. ఇది ముమ్మాటికీ అహంకార పూరితమైన చర్యగా అభివర్ణించారు.
ఇదే సమయంలో సెప్టెంబర్ నెల జీతాన్ని ఈరోజు వరకు ప్రభుత్వం చెల్లించలేదు. అంతే కాకుండా తార్నాకలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో చికిత్సలు నిలిపి వేశారు. దీంతో జీర్నించు కోలేని ఇద్దరు కార్మికులు ఆత్మహత్య కు పాల్పడ్డారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. తెలంగాణ అంతటా సీపీఐ పార్టీపై వత్తిడి మరింత పెరిగింది. ఇదే సమయమ్లో హుజూర్ నగర్ లో కనుక అధికార పార్టీ గెలిస్తే ఇక కేసీఆర్ అహంకారం మరింత పెరుగుతుందని, ఓడించి బుద్ది చెప్పాలని కోదండ రామ్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో సీపీఐ తన మద్దతును ఇవ్వడం లేదని ప్రకటించింది. దీంతో సర్కార్ పునరాలోచనలో పడింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి