ఏపీలో కొలువు తీరేదెవ్వరో..?

ఇలాంటి దారుణమైన ఫలితాలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు కలలో కూడా అనుకుని ఉండరు. జీవితంలో మరిచి పోలేని అపజయాన్ని అందించారు వైసీపీ అధినేత జగన్. ఈనెల 30న వేద పండితుల సాక్షిగా, జన సమక్షంలో జనామోదం పొందిన జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అతిరథ మహారథులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి రానున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు వన్ సైడ్‌గా తీర్పు ఇవ్వడం, 150 సీట్లకు చేర్చడంతో జగన్ ఉబ్బి తబ్బబవుతున్నారు. ఏదో 120 లేదా 130 సీట్లకే పరిమితమై పోతామని నమ్మకంతో ఉన్న జగన్‌కు ఊహించని రీతిలో ఆంధ్రా ప్రజలు గిఫ్ట్ ఇచ్చారు. ఏపీ చరిత్రలో ఇది చారిత్రాత్మక విజయం. ఊహించిన దానికంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు గెలిచారు. వీరితో పాటు 23 ఎంపీ సీట్లలో వైసీపీ పాగా వేసింది. బీజేపీతో సఖ్యత పాటిస్తున్న జగన్..మోదీ కేబినెట్‌లో చేరమని జగన్‌ను ఆహ్వానిస్తే ..చేరేందుకు సుముఖత చూపించవచ్చు. ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో జ...