డైన‌మిక్ స్ట్రాట‌జిస్ట్ ..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోరా మ‌జాకా..!

అత‌డు రంగంలోకి దిగాడంటే ..ఇక అంతే ప్ర‌త్య‌ర్థులు చిత్త‌యి పోవాల్సిందే. అత‌డు పులి కంటే వేగంగా ఆలోచిస్తాడు. రాకెట్ కంటే స్పీడ్‌గా త‌న ప్లాన్‌ను అమ‌లు చేస్తాడు. అంత‌కంటే భిన్నంగా త‌న‌దైన మార్క్ తో ..స్ట్రాట‌జీని అమ‌లు చేస్తాడు. ఎక్క‌డా రాజీ ప‌డ‌టం అంటూ ఉండ‌దు. ప‌ని అంతా పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉంటుంది. ప‌క్కా లోకల్ గా అనిపిస్తుంది ఆయ‌న ఆలోచ‌నా తీరు. అప‌ర మేధావిగా..ఇండియాలో ఎవ‌రికీ రానంత పాపులారిటీ ఆయ‌నకు రానే వ‌చ్చింది. 

గెలుపు కావాలంటే..విజ‌యం సాధించాలంటే..ఏం చేయాలో అత‌డికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ను కోవాలి. అంత‌లా పాపుల‌ర్ అయి పోయాడు అత‌డు. ఇంత‌గా ఇంట్ర‌డ్యూస్ చేయాల్సిన వ్య‌క్తి ఎవ‌ర‌త‌డంటే..ఒకే ఒక్క‌డు..డైన‌మిక్ లీడ‌ర్..స‌క్సెస్ స్పెష‌లిస్ట్ - ప్రశాంత్ కిషోర్. యుద్ధంలో గెల‌వాలంటే ఏం చేయాలి. ఎవ‌రిని ఎప్పుడు సంప్ర‌దించాలి. ఏయే శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్టు కోవాలి. ఎవ‌రి బ‌లాలు ఏమిటి..బ‌ల‌హీన‌త‌లు ఏమిటి..ఏం చేస్తే స‌క్సెస్ చెంత వాలుతుంది. ఇవ‌న్నీ త‌నొక్క‌డే అమ‌లు చేస్తాడు. 

ఎవ‌రూ త‌న ప‌క్క‌న ఉండ‌రు. ఉప్పెన‌లా దూసుకెళ‌తాడు. సునామీలా అల్లుకు పోతాడు. జ‌నాన్ని మాట‌ల‌తో మంత్రం చేస్తాడు. నినాదాల‌తో త‌ల్ల‌డిల్లేలా..త‌లుచుకునేలా ..ప్ర‌జ‌ల నాలుక‌ల మీద ఉండేలా వ‌ర్క‌వుట్ చేస్తాడు. అందుకే అత‌డి వ్యూహం ఏమిటో..ఏ వైపు నుంచి వ‌చ్చి ఢీకొడ‌తాడో ఎవ‌రికి తెలియ‌దు. త‌న‌కంటూ సుశిక్షుతులైన సైనికులు ఉన్నారు. వారంతా త‌న టీంలోని స‌భ్యులే. ప‌ని కొద్ది సేపే..అంతా గ్రౌండ్ వ‌ర్కే..ఇది ప్ర‌శాంత్ కిషోర్ స్పెషాలిటీ.

అంద‌రూ జ‌గ‌న్ గురించి పొగుడుతున్నారు..ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. జ‌గ‌న్‌లోని అహంకార‌న్ని అణిచి వేసి..ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా తీర్చిదిద్దిన ఘ‌న‌త ప్ర‌శాంత్ కిషోర్ దే. పాద‌యాత్ర‌లు చేప‌ట్టినా..బాబును ఢీకొన‌లేక చ‌తికిల ప‌డిన స‌మ‌యంలో మిస్సైల్‌లా దూసుకు వ‌చ్చాడు . ఇంకేం వైసీపీని ప‌రుగులు పెట్టించాడు. చంద్ర‌బాబు వ‌ల ప‌న్నాడు. త‌న చ‌ట్రంలో తానే ఇరుక్కునేలా చేశాడు. కోలుకోలేని దెబ్బ తీశాడు. 

ఇదీ వ్యూహం అంటే. అప‌ర చాణుక్యుడిగా త‌న‌ను తాను అభివ‌ర్ణించుకునే బాబు..ఈసారి ప్రశాంత్ కిషోర్‌ను త‌క్కువ అంచ‌నా వేశాడు. ప‌ట్టుమ‌ని ప‌ది ఓట్లు కూడా తీసుకు రాలేని వాళ్ల‌ను త‌న చుట్టూ పెట్టుకున్న బాబు కింది స్థాయిలో జ‌రుగుతున్న నిశ్శ‌బ్ద విప్ల‌వాన్ని గుర్తించ‌లేక పోయాడు. అత్యుత్సాహంతో..అతి ఆత్మ విశ్వాసంతో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాడు.

సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, రాజ‌ధాని నిర్మాణం, ఐటీ కంపెనీలతో ఎంఓయులు, ప‌సుపు కుంకుమ‌, రైతు బంధు ప‌థ‌కం గ‌ట్టెక్కిస్తుంద‌ని న‌మ్మారు. వీట‌న్నింటిని పీకే గుర్తించారు. ఇంకేం బాబుకు తెలియ‌కుండానే వైసీపీని అన్ని చోట్లా అంటే 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అనామ‌కుల‌ను అసాధ్య‌మైన విజ‌యాలు న‌మోదు చేసుకునేలా తీర్చిదిద్దాడు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని తెప్పించు కోవ‌డం..సామాజిక మాధ్య‌మాల్లో టీడీపీ కంటే వైసీపీ ముందంజ‌లో ఉండేలా చేశాడు. జ‌గ‌న్‌కు అంతులేని ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. రావాలి జ‌గ‌న్..కావాలి జ‌గ‌న్ అంటూ ఇచ్చిన స్లోగ‌న్ బుల్లెట్‌లా పేలింది. 

ఓట్ల‌ను రాబ‌ట్టింది. టీడీపీని మ‌ట్టి క‌రిపించేలా చేసింది. ఈ విజ‌యం ముమ్మాటికీ ప్రశాంత్ కిషోర్ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇండియాలో పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా ప్ర‌శాంత్ కిషోర్‌కు పేరుంది. హెల్త్ రంగంలో ఎనిమిదేళ్ల పాటు యునైటెడ్ నేష‌న్స్‌లో ప‌ని చేశారు. ఇటీవ‌ల నితీష్ కుమార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 1977లో జ‌న్మించిన పీకే ..ఇపుడు ఇండియాలో మోదీ త‌ర్వాత పాపుల‌ర్ అయిన వ్య‌క్తి. త‌న ప‌వ‌ర్ ఏమిటో..తాను తలుచుకుంటే ఒక పార్టీని అధికారంలోకి తీసుకు రాగ‌ల‌న‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు పీకే. 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను 150 సీట్లు గెలుచుకునేలా చేశాడు. లోక్‌స‌భ స్థానాల్లో 25 స్థానాల‌కు గాను 25 వ‌చ్చేలా చేశాడు.

ఇండియా పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ పేరుతో సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. బూత్ లెవ‌ల్ క‌మిటీల‌ను బ‌లోపేతం చేశాడు. గుజ‌రాత్‌లో మోదీ సీఎం కావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 2014లో దేశ వ్యాప్తంగా మోదీని ప్ర‌ధాన‌మంత్రిని చేయ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. డిజిట‌ల్ టెక్నాల‌జీని వినియోగించాడు. సోష‌ల్ మీడియాలో హోరెత్తించాడు. బీజేపీకి కొత్త జ‌వ‌స‌త్వాలు క‌ల్పించాడు. న్యూ టెక్నాల‌జీని ఎలా ఉప‌యోగించు కోవాలో చేసి చూపించాడు. హిందూత్వ నినాదాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్న బీజేపీ ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా తీర్చిదిద్దాడు 

ప్ర‌శాంత్ కిషోర్. నిన్ను న‌మ్మం బాబు, బై బై బాబు లాంటి స్లోగ‌న్స్..న‌మో న‌మామి..మోదీ సునామీ అన్న రీతిలో ప్లాన్ చేశాడు. ప‌క్కాగా అమ‌లు ప‌రిచాడు. విజ‌యాన్ని జ‌గ‌న్ చేతిలో పెట్టాడు. ఇపుడు నితీష్ కుమార్ టీంలో స‌భ్యుడు. ఓ వైపు మోదీ..ఇంకో వైపు జ‌గ‌న్..ప్ర‌శాంత్ కిషోర్ ప్లాన్‌లో ఆరితేరిన ఆయుధాలు. ప్లాన్ ప‌క్కాగా వుంటే..గెలుపు ను ఎవ‌రు ఆప‌గ‌ల‌రు..జ‌స్ట్ దానిని  ఆస్వాదించడ‌మే. పీకే..చేతిలో తుపాకీ కాదు..ద‌ట్టించిన ఆయుధం. 

కామెంట్‌లు