ఆ కాలమే బావుండేది..!

ఇప్పటికీ పుస్తకం చదవకుండా ..రాయకుండా వుండలేను. వందల పుస్తకాలు. లెక్కలేనన్ని. వాటిలో కొన్ని ఆలోచింప చేస్తే..మరికొన్ని గుండెల్లో దాచుకునేలా చేశాయి. నేను లేకుండా వుండగలవా ..అని అప్పుడెప్పుడో అడిగింది..భార్య..ఉండగలను..కానీ పుస్తకాలు లేకుండా నేనుండలేనన్నా..కొన్ని రోజులు మాటలు బంద్..పెళ్లి కదా. అదో బంధం..అంతులేని సంబంధం. ఆ కాస్తా ఇద్దరి మధ్య ఆకర్షణ అన్నది లేకపోతే ఇంతలా ..అల్లుకు పోవడాలు..ఆవేశకావేశాలు..ఆలోచనల కలబోతలు..అలకలు..పలకరింతలు..చూపులు..మళ్లీ మాట్లాడుకోవటాలు..ఇదేగా కుటుంబాలు బలంగా వుండేందుకు దోహద పడుతున్నాయి. పదిలోనే దాస్ కేపిటల్ చదివాక..అదేదో ప్రపంచాన్ని జయించినంత ఆనందం. ఊళ్లో పకీర్లు..నాటకాలు వేసే వాళ్లను చూస్తే ప్రేమ. సంతలు, జాతర్లలో డ్రామాలు. కర్నూలు నుండి రజనీబాయి వస్తుందంటే జనం విరగడి వాలేవారు. ఇపుడు లెక్కలేనంత మంది జనం. అందరూ నటులే..నటీమణులే. ప్రతిభతో ఏం పని. టెక్నాలజి పెరిగింది కదా.. మన శరీరం ఒక్కటి అప్పగిస్తే చాలు..అన్నీ అందుబాటులో దొరుకుతాయి. మనం కాకుండా పోతామంతే.. కాలం మారందని అన...