పోస్ట్‌లు

ఏప్రిల్ 22, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ట్విట్ట‌ర్ ఇండియా చీఫ్‌గా మ‌నీష్ మ‌హేశ్వ‌రి

చిత్రం
ఐటీ రంగంలో..సామాజిక మాధ్య‌మాల్లో త‌న‌కంటూ ఎదురే లేకుండా టాప్ పొజిష‌న్‌లో ఉన్న దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇండియ‌న్స్‌కు ప‌ట్టం క‌డుతున్నాయి. గూగుల్‌కు సిఇఓగా , మైక్రోసాఫ్ట్ తో పాటు అమెజాన్ కంపెనీకి ఇంద్రా నూయిని ఎంపిక చేసుకున్నాయి. మ‌రో వైపు ప్ర‌పంచాన్ని చిట్టిపొట్టి సందేశాల‌తో దుమ్ము రేపుతూ ..కోట్లాది రూపాయ‌ల‌ను వెన‌కేసుకుంటున్న ట్విట్ట‌ర్ దిగ్గ‌జం ఇండియా కంట్రీ చీఫ్‌గా..మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా మ‌నీష్ మ‌హేశ్వ‌రిని నియ‌మించింది. దీంతో భార‌తీయులు మ‌రో మైలురాయిని దాటార‌ని చెప్ప‌వ‌చ్చు. నిన్న అమెజాన్..ఇవాళ ట్విట్ట‌ర్‌లు రెండూ అమెరికాకు చెందిన కంపెనీలే. అదే స్థానంలో ఉన్న క్రిష్ శాన్ ఫ్రాన్సిస్‌కో లో ఉన్న ట్విట్ట‌ర్ కార్య‌క‌లాపాలు చూస్తారు. ఇండియాలో ట్విట్ట‌ర్ కార్య‌క‌లాపాల‌ను మ‌నీష్ చూస్తార‌ని ట్విట్ట‌ర్ ఛైర్మ‌న్ వెల్ల‌డించారు. అంత‌కు ముందు ఇండియా కంట్రీ హెడ్స్‌గా త‌ర‌ణ్ జీత్ సింగ్, బాలాజీ క్రిష్ ప‌నిచేశారు. మ‌హేశ్వ‌రి అంత‌కు ముందు నెట్‌వ‌ర్క్ 18 డిజిట‌ల్ మీడియా కంపెనీకి సిఇఓగా ప‌నిచేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే..సోష‌ల్ మీడియా ..డిజిట‌ల్ రంగంలో ఇండియాలోనే ఎక్కువ‌గా వ్యాపారం కొన‌సా...

ఆగ‌ని ఆత్మ‌హ‌త్య‌లు..ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు

చిత్రం
తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ నీరు గారి పోయింది. కేజీ టూ పీజీ పేరుతో జ‌పం చేస్తున్న ప్ర‌భుత్వం క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డంలో..వ‌న‌రులు ఏర్పాటు చేయ‌డంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. ఇప్ప‌టికే ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు చేసిన త‌ప్పిదాల నిర్వాకానికి 16 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ బోర్డు ముందుగానే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఎలాంటి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చోటు చేసుకోలేదు. దీంతో తీవ్ర‌మైన ఒత్తిడి తెలంగాణ ఇంట‌ర్ బోర్డుపై ప‌డింది. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో హుటా హుటిన టిఎస్ ఇంట‌ర్ బోర్డు ఉన్న‌తాధికారులు జ‌నార్ద‌న్ రెడ్డి, డాక్ట‌ర్ అశోక్‌లు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డించారు. ప్ర‌క‌టించిన నాటి నుండి నేటి దాకా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చోటు చేసుకున్నాయి. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో టాప్ పొజిష‌న్లో ఉన్న స్టూడెంట్స్ సెకండియ‌ర్ వ‌ర‌కు వ‌చ్చేస‌రిక‌ల్లా చాలా స‌బ్జెక్టులు కోల్పోయారు. దీంతో పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళ‌న బాట ప‌ట్టారు. ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేశారు. ఏకంగా ఇంట‌ర్ బోర్డు నిర్వాకంప...

బంగారం భ‌ద్రం - దేనికైనా సిద్ధం - ఈఓ సింఘాల్

చిత్రం
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చుట్టూ నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. కోట్లాది భ‌క్తులు కొలిచే దైవంగా తిరుమ‌ల‌కు మంచి పేరుంది. టీటీడీ బోర్డు స‌భ్యుల తీర్మానం ..ప‌ర్మిష‌న్ లేకుండా ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ భారీ ఎత్తున బంగారాన్ని వేరే బ్యాంకులో డిపాజిట్ చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఓ ర‌కంగా చెప్పాలంటే చిన్న గ్రాము బంగారం కూడా ప‌క్క‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. కోట్లాది రూపాయ‌లు, లెక్కించ‌లేనంత బంగారం, వెండి, వ‌జ్రాభ‌ర‌ణాలు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, ప‌ద్మావ‌తి అమ్మ‌వార్ల‌కు భ‌క్తులు స‌మ‌ర్పించుకుంటుంటారు. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంత‌మైన ఆల‌యంగా తిరుమ‌ల ఆల‌యానికి పేరుంది. క‌ష్ట‌ప‌డే నిబ‌ద్ధ‌త క‌లిగిన ఉన్న‌తాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్‌కు మంచి పేరుంది. ఆయ‌న ఈఓగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌..అక్ర‌మార్కులు, మ‌ధ్య ద‌ళారీలు, ఇత‌రుల పెత్త‌నానికి చెక్ పెట్టారు. దీనిని జీర్ణించుకోలేని కొన్ని శ‌క్తులు ఆయ‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ వ‌స్తున్నారు. కానీ ఆయ‌న మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆల‌యానికి సంబంధించిన బంగారం గురించి పూర్తి వివ‌రాల‌ను ఈఓ సి...

పోటెత్తిన ఓట‌ర్లు..ఓట్లేసిన ప్ర‌ముఖులు - త‌ల్లికి మొక్కిన మోదీ

చిత్రం
దేశంలో ఎన్నిక‌ల వాతావార‌ణం మ‌రింత వేడిని రాజేస్తోంది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఇప్ప‌టికే రెండు విడత‌ల పోలింగ్ పూర్తి కాగా..ప్ర‌స్తుతం మూడో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాలు..రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో 1640 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వాస్త‌వానికి మూడో ద‌శ‌లో భాగంగా 115 సీట్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. త్రిపుర‌లోని త్రిపుర‌..తూర్పు లోక్‌స‌భ స్థానం ఎన్నిక రెండో ద‌శ నుండి మూడో ద‌శ‌కు వాయిదా ప‌డింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 116కు చేరింది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, స‌మాజ్‌వాది పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాద‌వ్, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు జ‌య‌ప్ర‌ద‌, మేన‌కాగాంధీ కొడుకు వ‌రుణ్ గాంధీ, సుప్రియా సూలే, శ‌శిథ‌రూర్, జ‌న‌తాద‌ళ్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, త‌దిత‌ర దిగ్గ‌జాలు మూడో ద‌శ‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించు కోనున్నారు. మ‌రో వైపు ఒడిషా లోని 42 శాస‌న‌స‌భ స్థానాల‌కు కూడా పార్ల‌మెంట్ ఎ...

టెలికాం రంగంలో దూసుకెళుతున్న జియో

చిత్రం
ప్ర‌పంచ టెలికాం రంగంలో మిస్సైల్ కంటే వేగంగా రిలయ‌న్స్ కంపెనీ ప్ర‌వేశ పెట్టిన జియో రికార్డుల‌ను బ్రేక్ చేసుకుంటూ వెళుతోంది. నిన్న‌టి దాకా ఇండియ‌న్ మార్కెట్‌ను శాసించిన టెలికాం సంస్థ‌లు ఎయిర్ టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్‌, ఐడియా , త‌దిత‌ర కంపెనీల‌న్నీ రిల‌య‌న్స్ కొట్టిన దెబ్బ‌కు విల‌విల‌లాడుతున్నాయి. ఎటూ పాలుపోలేక ..ఏం చేయాలో తెలియ‌క తంటాలు ప‌డుతున్నాయి. గ‌త్యంత‌రం లేక జియో స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా భారత్ ప్ర‌భుత్వ సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ టెలికాం కంపెనీ విస్తృత‌మైన నెట్ వ‌ర్క్‌ను క‌లిగి ఉన్నది. అంతేకాకుండా నెట్‌వ‌ర్కింగ్‌లోను..ఇటు డేటాను అనుసంధానం చేయ‌డంలోను..ఫైబ‌ర్ ఆప్టిక్ సిస్టంలోను బిఎస్ ఎన్ ఎల్ త‌ర్వాతే ఏ కంపెనీ అయినా. అది కూడా ప్రైవేట్ టెలికాం ఆప‌రేట‌ర్ల దెబ్బ‌కు కుదుపుల‌కు లోనైంది. ఆ త‌ర్వాత రిల‌య‌న్స్ త‌క్కువ ధ‌ర‌కే మొబైల్స్ ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. అంత‌కు ముందు ఇండియాలో మోటారోలా, నోకియా కంపెనీలకు చెందిన మొబైల్స్ అందుబాటులో ఉండేవి. ఇపుడు ఆ ప‌రిస్థితి మారి పోయింది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ప‌రంగా చోటు చేసుకున్న స‌మూల మార్పులు టెల...

కాంగ్రెస్ ను వీడుతున్న నేత‌లు..ఖాళీ అవుతున్న కుర్చీలు

చిత్రం
అటు దేశంలో ఇటు రాష్ట్రంలో సుదీర్ఘ‌కాలం పాటు అధికారంలో ఉన్న ..ఘ‌న‌మైన చ‌రిత్ర స్వంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోయే ప‌రిస్థితిని కొని తెచ్చుకుంటున్న‌ది. పార్టీలో నెంబ‌ర్ వ‌న్, టు పొజిష‌న్‌లో ఉన్న వారంతా ఒక్కొరొక్క‌రుగా మాతృ సంస్థ‌ను వీడుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన పోరాటాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ..సోనియా గాంధీ నేతృత్వంలో సానుకూలంగా స్పందించింది. రాష్ట్రం ఇచ్చేంత దాకా నిద్ర పోన‌ని, ఢిల్లీ నుండి హైద‌రాబాద్‌లో కాలు పెట్ట‌నంటూ స‌వాల్ విసిరి..సాధించిన కేసీఆర్‌కు మ‌ద్ధ‌తుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ త‌ర్వాత కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో మొద‌టిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ హై క‌మాండ్ తాము అధికారంలోకి వ‌స్తామ‌ని..ఎందుకంటే తామే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాము కాబ‌ట్టి జ‌నం ఓట్లేస్తార‌ని అతి ఆత్మ‌విశ్వాసంతో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది. బొక్క బోర్లా ప‌డింది. టు డిజిట్స్ కే ప‌రిమిత‌మైంది. టీఆర్ ఎస్ హోరు గాలికి మిగ‌తా పార్టీలు సింగిల్ డిజిట్స్‌కే ప‌రిమిత‌మై పోయాయి. ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆకర్ష్ దెబ్బ‌కు చ...

పోరాడిన రెహానే..ర‌ఫ్పాడించిన పంత్ - నిలిచిన ఢిల్లీ

చిత్రం
ఐపీఎల్ టోర్న‌మెంట్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో గెల‌వాల్సిన చోట చేజేతులారా ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు. ఢిల్లీ జ‌ట్టులో శిఖ‌ర్ ధావ‌న్ ప్రారంభం నుంచే దుమ్ము రేపాడు. శిఖ‌ర్‌కు రిష‌భ్ పంత్ జ‌త క‌ట్టి ..రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నారు. భారీ స్కోర్‌ను రాజ‌స్థాన్ జ‌ట్టు సాధించింది. ఈ టార్గెట్ చేధ‌న‌లో డీసీ జ‌ట్టు స‌క్సెస్ అయ్యింది. కీల‌క స‌మ‌యంలో వికెట్ల‌ను పారేసుకుంటున్న డిసి జ‌ట్టు ఈసారి ఆ త‌ప్పిదం చేయ‌లేదు. వికెట్ల‌ను కాపాడుకుంటూనే మ‌రో వైపు ల‌క్ష్యాన్ని చేరుకునే ప్ర‌య‌త్నం చేశారు. రాజ‌స్థాన్‌తో గెలుపొంద‌డంతో టోర్నీలో ఏడు విజ‌యాలు న‌మోదు చేసుకుంది. టాప్‌లో నిలిచింది. ఇక రాజ‌స్థాన్ జ‌ట్టులో కెప్ట‌న్ ప‌ద‌విని కోల్పోయిన అజింక్యా రెహానే అత్య‌ద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు. అజేయంగా సెంచ‌రీ సాధించాడు. అయినా జ‌ట్టును కాపాడలేక పోయాడు. ఆ జ‌ట్టు బౌల‌ర్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ఓట‌మి కొనితెచ్చుకున్నారు.మైదానంలోకి దిగిన రిష‌బ్ బంత్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. 36 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ ఆట‌గాడు ఆరు ఫోర్లు ..నాలుగు సిక్స...

అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గా ఇంద్రా నూయి

చిత్రం
అమెరికన్ పెప్సికో కంపెనీకి సిఇఓగా ప‌నిచేసి ..ప‌ద‌వీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న ప్ర‌ముఖ భార‌తీయురాలు ..స‌క్సెస్ ఫుల్ సిఇఓగా పేరు తెచ్చుకున్న ఇంద్రా నూయి మ‌రో అమెరిక‌న్ కంపెనీ..కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌పంచంలోనే అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పెప్సీకో కంపెనీని లాభాల బాట ప‌ట్టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్‌లో దానిని టాప్ టెన్‌లో ఒక‌టిగా నిలిపారు. అనుకోకుండా ఆ కంపెనీ నుండి వైదొలిగారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో కొంత కాలం మౌనంగా ఉన్నారు. 28 అక్టోబ‌ర్ 1955లో జ‌న్మించిన నూయి ఎక్క‌ని ఎత్తు ప‌ల్లాలు లేవు. 2014లో ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌, ప‌వ‌ర్ ఫుల్ ఉమెన్స్ కేటగిరీలో 100 మందిని ఎంపిక చేశారు. అందులో 13వ స్థానంలో మ‌న ఇంద్రా నూయి ఉన్నారు. ఫార్చూన్ 2015లో ప్ర‌క‌టించిన జాబితాలో వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే రెండో స్థానంలో నిలిచారు. సిఇఓగా స‌మ‌ర్థ‌వంతమైన బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంతో..ప్ర‌పంచంలోనే అత్యంత లిక్విడ్ క‌లిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌ...

దూసుకెళుతున్న ఐపీఎల్ - డాల‌ర్లు కురిపిస్తున్న టోర్నీ

జీ గ్రూప్ సంస్థ‌ల ఛైర్మ‌న్ సుభాష్ చంద్ర ఏ ముహూర్తాన దేశీయ జ‌ట్ల‌తో టోర్న‌మెంట్ ప్రారంభించాడో అదే ఇవాళ ఇండియాను ఊపేస్తోంది. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల రీత్యా దానిని ఆపి వేశారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొని దేశం నుండి వెళ్లి పోయిన ల‌లిత్ మోడీ చేసిన ప్ర‌య‌త్న‌మే ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ అదే ఐపీఎల్. ఈ దేశంలో ఏ ఆట‌కూ లేనంత పిచ్చి క్రికెట్ ఆట‌కే ఉన్న‌ది. కోట్లాది అభిమానులు క్రికెట్ అంటే ప‌డి చ‌స్తున్నారు. ఏ రోజైతే బీసీసీఐ టోర్నీల‌ను నిర్వ‌హిస్తోందో ఇక సినిమాలు ఆడ‌డం లేదు. వ్యాపారాలు న‌డ‌వ‌డం లేదు. కాలేజీల‌లో స్టూడెంట్స్ చ‌ద‌వ‌డం మానేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల‌కు చెందిన వ్యాపార‌వేత్త‌లు, య‌జ‌మానులు , ఐటీ కంపెనీలు, రెస్టారెంట్స్ ల‌లో ఐపీఎల్, ప్ర‌పంచ‌క‌ప్, వ‌న్డే, టెస్ట్ మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నారు. ఇంకో వైపు ఐటీ సెక్టార్ పై తీవ్ర ప్ర‌భావం చూప‌డంతో ..గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఐటీ కంపెనీల ఓన‌ర్స్ ..కూర్చున్న చోట‌నే మ్యాచ్‌ల‌ను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయా న‌గ‌రాల‌లో ఒక‌వేళ క్రికెట్ మ్యాచ్ జ‌రిగితే..ఆయా మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్షంగ...