టెలికాం రంగంలో దూసుకెళుతున్న జియో
ప్రపంచ టెలికాం రంగంలో మిస్సైల్ కంటే వేగంగా రిలయన్స్ కంపెనీ ప్రవేశ పెట్టిన జియో రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళుతోంది. నిన్నటి దాకా ఇండియన్ మార్కెట్‌ను శాసించిన టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్, ఐడియా , తదితర కంపెనీలన్నీ రిలయన్స్ కొట్టిన దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఎటూ పాలుపోలేక ..ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నాయి. గత్యంతరం లేక జియో స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా భారత్ ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికాం కంపెనీ విస్తృతమైన నెట్ వర్క్‌ను కలిగి ఉన్నది. అంతేకాకుండా నెట్‌వర్కింగ్‌లోను..ఇటు డేటాను అనుసంధానం చేయడంలోను..ఫైబర్ ఆప్టిక్ సిస్టంలోను బిఎస్ ఎన్ ఎల్ తర్వాతే ఏ కంపెనీ అయినా. అది కూడా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల దెబ్బకు కుదుపులకు లోనైంది. ఆ తర్వాత రిలయన్స్ తక్కువ ధరకే మొబైల్స్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
అంతకు ముందు ఇండియాలో మోటారోలా, నోకియా కంపెనీలకు చెందిన మొబైల్స్ అందుబాటులో ఉండేవి. ఇపుడు ఆ పరిస్థితి మారి పోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చోటు చేసుకున్న సమూల మార్పులు టెలికాం రంగాన్ని మరింత పరిపుష్టం చేశాయి. ఇంటర్నెట్‌లో సామాజిక మాధ్యమాలు రాజ్యం ఏలడంతో ఇంటర్నెట్ అన్నది అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు చెందిన కంపెనీలన్నీ టెక్నాలజీని వాడు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇంటర్నెట్ వాడుకోవడం కంపల్సరీ కావడంతో రిలయన్స్ ప్రవేశ పెట్టిన ఆకర్షణీయమైన ఆఫర్లు ఇతర టెలికాం కంపెనీలను కోలుకోలేకుండా చేశాయి. అత్యంత చౌకగా డేటా, కాలింగ్ సౌకర్యం ..ఇంటర్నెట్ వాడకంలో న్యూ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది రిలయన్స్ జియో. పేదలు, మధ్యతరగతి ప్రజలను రిలయన్స్ టార్గెట్ చేసింది. ఆకర్షణీయమైన డేటా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
దేశమంతటా ఫైబర్ ఆప్టిక్ సిస్టంను ఎష్టాబ్లిష్ చేసింది. నీళ్లు దొరకవేమో కానీ ..దేశమంతటా ఇపుడు రిలయన్స్ జియోతో అనుసంధానం అయ్యేలా మారిపోయింది. ఇండియా అంటే రిలయన్స్ అనే స్థితికి మార్కెట్ మారి పోయింది. గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. టెలికాం రంగాన్ని రిలయన్స్ శాసిస్తోంది. ఏదో రకంగా భారతీ మిట్టల్ ఎయిర్ టెల్ పోటీ ఇస్తుందనుకుంటే వారి వినియోగదారులు సైతం రిలయన్స్ లోకి మారి పోయారు. ఇతర టెలికాం ఆపరేటర్ల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి మారి పోయారు. దీంతో ప్రపంచ టెలికాం రంగంలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ గా రిలయన్స్ కంపెనీ అవతరించింది. కోట్లాది రూపాయల ఆదాయం సమకూరింది. తక్కువ ధరకే డేటా, కాల్స్ సౌకర్యమే కాకుండా వివిధ కంపెనీలతో స్మార్ట్ ఫోన్టలను విక్రయిస్తోంది. ఇండియా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రిలయన్స్ జియో స్టోర్స్ ను ఏర్పాటు చేసింది. ప్రతి 10 మంది టెలికాం వినియోగదారులుంటే ..అందులో 9 మంది రిలయన్స్ కంపెనీ సభ్యులే.
అంటే అర్థమైందిగా రిలయన్స్ ఎంతగా దూసుకెళుతుందో. ఇంతలా మిగతా కంపెనీలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ..బిజినెస్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ లాభాల బాట పట్టిన ఈ కంపెనీకి అసలైన సూత్రదారులు ఎవరంటే..అంబానీ కూతురు, కొడుకే. అంటే నమ్మగలమా..ఇది అక్షరాల వాస్తవం కూడా. ఇక..టెలికాం ఇండస్ట్రీలో ఉన్న తీవ్ర పోటీని తట్టుకుని జియో ఫోన్ డిసెంబరు 2019 నాటికి 5 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంటుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 45-50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి జియోకు 50 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉంటారని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
అంటే మొత్తం ఫీచర్‌ఫోన్ వినియోగదారుల్లో ఇది 10 శాతం.
అయితే, ఫీచర్ ఫోన్ సబ్‌స్క్రైబర్స్ వృద్ధిలో జియోతో సహా అన్ని టెలికాం సంస్థలకు ఏఆర్‌పీయూ కీలకం కానుంది. జియో దీనిపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రతి నెలా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సైతం పెరుగుతూ వస్తున్నారు. ఈ ‘ఫిబ్రవరి 2019లో యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ 1,023 మిలియన్ల మంది ఉన్నారు. రిలయన్స్ జియోకు 9.3మిలియన్లు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ 3.2మిలియన్లు, వొడాఫోన్, ఐడియాలు 7.2 మిలియన్ల యాక్టివ్ యూజర్లను కోల్పోవడం రిలయన్స్ కంపెనీకి వున్న పవర్ ఏమిటో తెలుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి