వసూళ్ళలో జోకర్ బేఫికర్

హాలీవుడ్ లో ఇప్పుడు జోకర్ సినిమా హవా నడుస్తోంది. జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ 'జోకర్' మూవీ బాక్సాఫీస్ వద్ద తన కలెక‌్షన్లను స్థిరంగా కొనసాగిస్తోంది. గత నెలలో ప్రపంచ వ్యాప్తంగా జోకర్ విడుదలైంది. సినిమాలో హింస ఎక్కువగా ఉందంటూ విమర్శకులు పెదవి విరిచినా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది జోకర్. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు దాటిన తొలి ఆర్-రేటెడ్ సినిమా గా నిలిచింది. ఇంతకు ముందు 2018లో వచ్చిన ర్యాన్ రేనాల్డ్స్ నటించిన కామెడి థ్రిల్లర్ 'డెడ్‌పూల్ 2' సినిమా .78.5 , డెడ్‌పూల్ 75 కోట్లు వసూలు చేయగా, తాజాగా జోకర్ ఆ సినిమాల రికార్డును అధిగమించింది. అంతే గాక చైనాలో ఆర్-రేటడ్ సినిమాలను అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ జోకర్ సినిమాను మాత్రం ప్రేక్షకులు హిట్ సినిమాగా నిలిపారు. జోకర్‌గా నటించిన జోక్విన్ ఫీనిక్స్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 62.3 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో వార్నర్ బ్రదర్స్, డీసీ ఫిలిమ్స్ సంస్థ జోకర్ సినిమాను తెరకెక్కించగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వ...