జాయ్ కి హైదరాబాద్ ముస్తాబు
ఐటీ హబ్ గా దేశంలో ఇప్పటికే పేరొందిన హైదరాబాద్ మరో అంతర్జాతీయ వేదికకు ముస్తాబు కాబోతోంది. వరల్డ్ లోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ అండ్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే ఇండియా జాయ్ కార్యక్రమానికి మరోసారి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. నాలుగు రోజుల పాటు ఇండియా జాయ్-2019 కార్యక్రమం పేరుతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఇండియా జాయ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలిశారు.
ఈ సందర్భంగా జాయ్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాలకు చెందిన వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గేమింగ్ యానిమేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్య స్థానంగా మార్చేందుకు ‘ఇమేజ్ టవర్’ ను నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఇమేజ్ టవర్ ఈ రంగాలకు ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు’గా ఉండేలా, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమావేశంలో ఆయా రంగాలకు హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు. సిటీలో మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, వినోద రంగాలకు సంబంధించి అద్భుతమైన మానవ వనరులు అందు బాటులో ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ సినిమాలకు, చోటా బీమ్ వంటి గొప్ప కార్టూన్ సిరీస్ రూపకల్పన హైదరాబాద్ నగరంలోనే జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్, దేశీ టూన్స్, విఎఫ్ఎక్స్ సదస్సు, ఇన్ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, ఈ- స్పోర్ట్స్ వంటి పలు కార్యక్రమాలను ఈ నాలుగు రోజుల్లో చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం వివిధ దేశాల నుంచి సుమారు 30 వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఈ సదస్సు వల్ల ఇక్కడ టాలెంట్ కలిగిన వారికి మరింతగా సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి