పరుగుల వరద..మనదే ఆట
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. ఆరు వికెట్లు కోల్పోయి 493 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి 343 పరుగుల ఆదిక్యం సాధించింది. రవీంద్ర జడేజా 76 బంతుల్లో 60 పరుగులు చేయగా, ఉమేష్ యాదవ్ 10 బంతుల్లో 25 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. అబు జాయేద్ 4, ఎబాదత్ హొసేన్, మెహిదీ హసన్ తలో వికెట్ తీశారు. ఇక ఒక వికెట్ కోల్పోయి 86 పరుగుల ఓవ ర్‌నైట్ స్కోరుతో ఆటను మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా ఆరంభించి 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
చతేశ్వర పుజారా మెలమెల్లగా పరుగులు సాధిస్తూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. 54 పరుగులు చేశాక రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఫుల్ స్వింగ్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సున్నాకే వెనుదిరిగాడు. తాను ఆడిన రెండో బంతికి కోహ్లి డకౌట్‌గా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకొచ్చిన రహానే, మయాంక్ అగర్వాల్‌తో కలిసి మంచి భాగస్వామాన్ని నమోదు చేశాడు. ఈక్రమంలో మయాంక్ సెంచరీ సాధించాడు. రహానే 172 బంతుల్లో 86 రన్స్ చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
అనంతరం ఆదే ఊపుతో చెలరేగి ఆడిన మయాంక్ డబుల్ సెంచరీ తర్వాత.. జట్టు స్కోరు 432 వద్ద 330 బంతుల్లో 243 పరుగులు చేశాడు. ఇందులో 28 ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టాడు. కాగా11 బంతుల్లో 12 పరుగులు చేసిన వికెట్ కీపర్ వృద్ధి మాన్ సాహా ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మొత్తం మీద టీమిండియా బంగ్లా జట్టుపై పై సాధించింది. ఈ మ్యాచ్ కు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి