వైభవంగా అర్చన వివాహం

బిగ్‌బాస్‌ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపా రవేత్త జగదీశ్‌ భక్త వత్సలంల వివాహం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం గత నెలలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నగరంలో సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.

సిటీలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి రిసెప్షన్‌ నిర్వహించారు. అర్చన, జగదీశ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అర్చన క్లాసికల్‌ డ్యాన్సర్‌. అంతే కాకుండా పలు సినిమాల్లోనూ నటించి వెండి తెరపై మెరిసింది. అయితే సరైన హిట్‌ లేక పోవటంతో అడపా దడపా చిత్రాలకు మాత్రమే పరిమితమై పోయింది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరికీ సుపరిచితు రాలయ్యింది.

ఈ షోతో తగిన గుర్తింపు తెచ్చుకున్న అర్చన పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. తాజాగా వజ్ర కవచధర గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ ఫుల్ పాత్రను పోషించింది. కొంత కాలంగా సినిమాలు రాక పోవడంతో ఉన్నట్టుండి అర్చన మనసు పెళ్లి వైపు మళ్లింది. ఇదే సమయంలో డిసిషన్ తీసుకుంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో తెలుగు సినిమా రంగం ఆమెను ఉపయోగించు కోలేక పోయింది. పెళ్లి తర్వాత చాలా మంది నటీమణులు నటనకు దూరంగా ఉన్నారు. 

కామెంట్‌లు