ట్విట్టర్ సంచలన నిర్ణయం
సోషల్ మీడియాలో ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న ట్విట్టర్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. చిట్టి సందేశాలతో గణనీయమైన ఆదాయాన్ని గడిస్తోంది ఈ దిగ్గజ కంపెనీ. కాగా ఇటీవల ట్విట్టర్ రాజకీయ, వాణిజ్య ప్రకటనలను నిషేధిస్తున్నామని, దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తామని ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. కాగా మార్క్ జుకర్‌బర్గ్ సీఈవోగా ఉన్న ఫేస్‌బుక్‌లో పొలిటికల్, కమర్షియల్ ప్రకటనల రూపంలో రాజకీయాలపై దుష్ప్రచారం, నకిలీ వార్తలు పెద్ద ఎత్తున చెలామణి అవుతున్నాయి. దీంతో ట్విట్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, పూర్తి పారదర్శకత అలవడుతుందని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో రాజకీయ దుష్ప్రచారాన్ని లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న రాజకీయ, వాణిజ్య ప్రకటనల నిలిపి వేతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అమెరికా పార్లమెంట్ ప్రశ్నకు జుకర్‌బర్గ్ సరైన సమాచారం ఇవ్వలేదు.
దీంతో పలు పార్టీలు, అధినేతలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం అమెరికాతో పాటు పలు దేశాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఇదే సమయంలో తప్పుడు రాజకీయ ప్రకటనలపై ఫేస్‌బుక్ ఎలాంటి చర్య తీసుకుంటుందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా నిండు సభలో నిలదీశారు. పేస్ బుక్ నుంచి ఎలాంటి సరైన సమాధానం లభించలేదు. కాంగ్రెస్ కమిటీ ముందు జుకర్‌బర్గ్ ప్రతినిధిగా ట్రెయిన్ రెక్ హాజరయ్యారు. అయితే ట్విటర్ సీఈవో తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇక నుంచి ఎలాంటి ప్రకటనలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీలతో పోలిస్తే ‘ట్విటర్’ చాలా చిన్న సంస్థ.
అది తీసుకున్న నిర్ణయం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. అదే ఫేస్‌బుక్, గూగుల్ అలాంటి నిర్ణయం తీసు కున్నట్లయితే ఆశించిన ఫలితం ఉంటుంది. అది రాజకీయాల ప్రక్షాళనకు దారితీసే అవకాశం ఉంటుంది. తప్పుడు, అసత్య వార్తల ప్రచారానికి సోషల్ మీడియా మాధ్యమం అవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరుగుతోంది. భిన్న జాతుల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొట్టడం ద్వారా తిరోగమన పార్టీలు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను పేపర్ మీడియా అడ్డుకోవడం కష్టంగా మారింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి