పోస్ట్‌లు

అక్టోబర్ 24, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

బన్నీపై భారీ అంచనాలు

చిత్రం
రోజు రోజుకు తనను తాను కొత్త గెటప్ లో చూసు కోవడం తో పాటు జనానికి వినోదం పంచాలనే కసితో ఎప్పుడూ ప్రయత్నం చేసే పనిలో నిమగ్నమై ఉంటాడు బన్నీ అలియాస్ అల్లు అర్జున్. గంగోత్రి నుంచి నేటి అల వైకుంఠపురం సినిమా దాకా అన్నీ డిఫరెంట్ సినిమాలే. నడిచినా నడవక పోయినా పట్టించు కోకుండా డైరెక్టర్లు కోరిన దాని కంటే ఎక్కువగా కష్టపడతాడు. ఇప్పుడున్న హీరోలలో బన్నీది ఓ విలక్షణమైన కేరెక్టర్. టేకింగ్ లోను, డైలాగ్ డెలివరీ లోను బన్నీ కి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందుకే అతడితో సినిమాలు తీసేందుకు ఇష్ట పడతారు. బన్నీతో ప్రయాణం చాలా జోవియల్ గా ఉంటుందని అప్పట్లో ప్రముఖ దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. ఇదే సమయంలో అతడితో ఆయన మూడో సినిమా తీస్తున్నారు. అది దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇంతకు ముందు త్రివిక్రమ్ తో బన్నీ జులాయి,  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు తీశాడు. అవి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో అల వైకుంఠపురం లో అనే పేరుతో సినిమా తీస్తున్నారు. రాబోయే సంక్రాంతి కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అటు త్రివిక్రమ్ ఇటు బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న...

పూరికి సల్మాన్ బంపర్ ఆఫర్

చిత్రం
తెలుగు సినిమా రంగంలో ఇప్పటికే మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కు పేరుంది. ఆయన ప్రముఖ దిగ్గజ దర్హకుడు రామ్ గోపాల్ వర్మ టీమ్ లో సభ్యుడు. ఆర్జీవీ ఫ్యాక్టరీ లోంచి వచ్చిన ప్రతి ఒక్కరు తమ టాలెంట్ తో ఇండియాను షేక్ చేశారు. టాప్ మోస్ట్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు. వేలాది మందికి ఛాన్స్ ఇచ్చారు. కొందరికి లైఫ్ ఇచ్చారు. వారిలో పూరి జగన్నాథ్ మొదటి ప్లేస్ లో ఉంటాడు. అటు తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ ఇండస్ట్రీస్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు తీశాడు. తెలుగులో మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి తీశాడు. అది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రవితేజ తో ఇడియట్ తీశాడు. అది కూడా హిట్టే. ఇక ప్రిన్స్ మహేష్ బాబు తో పోకిరి తీశాడు. అది బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలిచింది. వసూళ్లను తిరుగ రాసింది. దీంతో పూరి జగన్నాథ్ ఎన్నో సినిమాలు తీశాడు. కొన్ని హిట్ గా నిలిస్తే మరికొన్ని ఆడలేదు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశాడు పూరి జగన్నాథ్. పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి. పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిన పూరి తిరిగి పైకి లేశాడు. తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. ...

అట్లి నోట తారక్ మాట

చిత్రం
అట్లి గుర్తున్నాడా. ఇండియన్ సినిమా సెక్టార్ లో ఇప్పుడు అతడో సంచలనం. ఏకంగా తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఒకే ఒక్క పేరు అదే అట్లి. నటి ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ కుర్రాడు ఏది చేసినా అదో సంచలనమే. ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్స్ లోకి మనోడు కూడా చేరి పోయాడు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ కు అట్లి ప్రియ శిష్యుడు. కేవలం మూడు సినిమాలు మాత్రమే తీశాడు. బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి ఈ సినిమాలు. దీంతో మనోడు మోస్ట్ పాపులర్ గా మారి పోయాడు. తాజాగా నటుడు విజయ్ తో బిగిల్ పేరుతో సినిమా తీశాడు. దానిని తెలుగులో విజిల్ గా విడుదల చేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబా కు వచ్చారు డైరెక్టర్ అట్లి. చాలా మంది తమిళ్ నటులతో పాటు తెలుగు, హిందీ నటులు కూడా అట్లీతో సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సందర్బంగా అట్లి మాట్లాడుతూ తెలుగులో సినిమా చేయాలని ఉందన్నారు. ఇటీవల జూనియర్ ఎన్ఠీఆర్ తో కలిసి ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ సినిమా గురించి అటు ఎన్టీయార్‌ కాని, ఇటు అట్లీ కాని అధికారికంగా స్పందించ లేదు. ఎన్టీయార్ సినిమా గురించి స్పందించాడు. తెలుగు సినిమా చేయాలని చాలా రోజుల నుంచ...

ఈజీ బిజినెస్ లో ఇండియా బెటర్

చిత్రం
మోదీ సంస్కరణలు కొంత మేర ఫలితాలు ఇస్తున్నాయి. తాజగా ఈజీ బిజినెస్ నిర్వహించే విషయంలో ఇండియా ప్లేస్  పెరిగింది. ప్రపంచ బ్యాంకు ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకుల్లో భారత్‌కు 63వ స్థానం లభించింది. ఒక్క సారిగా  భారత్‌ 14 స్థానాలు దాటడం విశేషం. ప్రభుత్వం తీసుకున్న పలు విధానాలు ఇందుకు దోహద పడ్డాయి. భారత్‌లో తయారీ పథకంతో పాటు ఇతర కీలక సంస్కరణలతో ఇండియా విదేశీ పెట్టుబడులను ఆకర్షించ గలిగింది. మరోవైపు టాప్‌ 10 పెర్‌ఫార్మర్స్‌ జాబితాలో వరుసగా మూడో సారి భారత్‌కు చోటు దక్కడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనం నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు , ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి  లతోపాటు వివిధ రేటింగ్‌ ఏజెన్సీలు భారత్‌ వృద్ధి రేటు అంచనాను తగ్గించాయి. ఇదే సమయంలో ర్యాంకింగ్స్‌ వెలువడటం విశేషం. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి 190 దేశాల్లో భారత్‌ స్థానం 142గా ఉంది. నాలుగేళ్ల పాటు చేపట్టిన వివిధ సంస్కరణలతో ఇండియా స్థానం డూయింగ్‌ బిజినెస్‌ 2018 నివేదికలో 100కు చేరుకుంది. గత ఏడాదిలో భారత్‌ 23 స్థానాలు ఎగబాకి 77కు చేరుకుంది. దివాలా, పన్నులు, ఇతర విభాగాల్లో చేపట్టిన సంస్కరణలు భారత్...

ఈ విజయం..అధికార దుర్వినియోగం

చిత్రం
తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి హుజూర్ నగర్ లో గెలుపొందింది. ఇది గెలుపు అనుకుంటే పొరపాటే. జనం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగలేదు. కానీ పూర్తిగా దుర్వినియోగం చేసింది. పోలీసుల జులుం కొనసాగింది. అయినా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చి పోయింది. కేసీఆర్ నయా నిజం నవాబు ను తలపింప చేస్తూ పాలన సాగిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. గెలిచేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేసింది ఈ సర్కారు. అయినా అంతిమ విజయం ప్రజలదే..టీఅర్ఎస్ ది కాదన్నారు. డబ్బులు, మద్యం వెదజల్లారు. జనాన్ని బురిడీ కొట్టించారు. ఇలా ఎంతో కాలం సాగదన్నారు మందకృష్ణ. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. తాను చెప్పిందే వేదం. తాను చేసిందే శాసనం అంటూ కేసీఆర్ అనుకుంటున్నారు. అది చెల్లుబాటు కాదు. ఆ విషయం ఆయనకు తెలుసు. ప్రపంచ చరిత్రలో రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసి పోయారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. వాస్తవం కూడా. ఓ వైపు వందలాది కార...

ఆర్టీసీ కేసీఆర్ జాగీర్ కాదు

చిత్రం
ఆర్టీసీ ప్రజల ఆస్తి. ఇది ముమ్మాటికీ కార్మికులది. కేసీఆర్ స్వంత జాగీరు కాదు. ఆయన అనుకున్నట్టు చేస్తానంటే కుదరదు. ఇక్కడ చెల్లదు. ఇది ముమ్మాటికీ కార్మికుల రెక్కల కష్టం తో నిర్మించుకున్న స్వేద సౌధం. దీనిపై కన్నేసినా లేదా రెప్పలా వాల్చినా ఊరుకోమని స్పష్టం చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఇక ఆర్టీసీ పని అయిపోయినట్లేనని, దాని కథ ముగిసిందని, కొందరు వెధవలు చెబితే కార్మికులు నమ్మి సమ్మెలోకి పోయారని, వారిపై ఎస్మా ఇప్పటికే ఉందని, కోర్టుకు శాసించే అధికారం లేదని, ఇక కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని..ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతే కాకుండా ఆర్టీసీని సర్వ నాశనం చేసింది కార్మికులు కాదని, వారిని పెడదోవ పట్టిస్తూ గడుపుతున్న యూనియన్ నేతలని మండిపడ్డారు. ఒక్క సంతకం చేస్తా..పర్మిట్లు ఇస్తా..వెహికిల్స్ ఎందుకు తిరుగవో చూస్తానని కేసీఆర్ అన్నారు. దీనిపై ఆర్టీసీ నాయకులు, విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారులకు దారదత్తం చేసేందుకే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నాడని అశ్వత్థామ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ...

షాకు షాక్..మోదీకి ఝలక్

చిత్రం
మోడీ ఛరిష్మా ..అమిత్ షా మ్యాజిక్ హరియాణా లో వర్కవుట్ కాలేదు. అబ్‌కీ బార్‌ 75 కే పార్‌ అని ధీమాగా  ఎన్నికల రణాంగంలోకి దూకిన బీజేపీ అంచనాలు అనూహ్యంగా తలకిందులయ్యాయి. ఇక్కడ త్రిశంకు సభ ఏర్పడింది. అతి ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా అవతరించడం ఒక్కటే బీజేపీకి కాస్త ఊరట. ఓ ఆరుగురిని తమ వైపునకు తిప్పుకొంటే మళ్లీ వారిదే ప్రభుత్వం. ఇందు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్యను కలిసి అభ్యర్థించారు. 90 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 70 పైచిలుకు స్థానాలు ఖాయమని బీజేపీతో పాటు మెజారిటీ చానెళ్లు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో అంచనా వేశాయి. ఫలితాలు వెల్లడి అయ్యాక బీజేపీ ఖాతా 40 దాటలేక పోయింది. కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు చేస్తూ 30 సీట్లు సాధించింది. కొత్త పార్టీ జననాయక్‌ జనతా పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అవిభక్త ఐఎన్‌ఎల్‌డీ పార్టీ  చీలికలతో కుదేలై చివరకు ఒక్క స్థానాని కే పరిమిత మైంది. సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాల...

మీటూ కే జై అంటున్న పూజా హెగ్డే

చిత్రం
ఇండియన్ సినిమా రంగంలో మీటూ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. చాలా మంది వేధింపులకు గురయ్యారు. మరికొందరు హీరోయిన్లు తమకు ఎక్కడ అవకాశాలు రావేమోననే భయంతో బయటకు రాలేదు. దీంతో ఈ టార్చర్ ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నదేనని కొందరు బహిరంగంగా తమ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. వారిలో మొదటగా చెప్పాల్సింది ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద. ఆమె తన వాయిస్ ను మొదటి సారిగా వెల్లడించింది. ప్రముఖ రచయిత వైరముత్తు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెతో పాటు ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ గారాల పట్టి, సినీ నటి వరలక్ష్మి సైతం గళం విప్పింది. తనకు కూడా ఇలాంటి వేధింపులు తప్పలేదంటూ పేర్కొంది. వీరే కాకుండా పలువురు బయటకు వచ్చి ధైర్యంగా తమ పట్ల డైరెక్టర్స్, ఇతరులు ఎలా వేధింపులకు పాల్పడ్డారో చెప్పారు. ఈ మీటూ దేశమంతటా వైరల్ అయ్యింది. తాజాగా ప్రముఖ తెలుగు నటి పూజా హెగ్డే సైతం మీటూ ఉండాల్సిందేనంటూ స్పందించింది. మీటూ ఉద్యమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నటిగా, స్త్రీగా నా అభిప్రాయమేంటంటే..ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోకూడదు. మీటూ వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా...

లాభాల బాటలో ఐటీసీ

చిత్రం
మార్కెట్ వర్గాల అంచనాలు తలకిందులు చేస్తూ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థ ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో  4,174 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం  .3,045 కోట్లుతో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ వెల్లడించింది. పేపర్‌ బోర్డ్స్, హోటళ్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఇతర వ్యాపారాలలో జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని తెలిపింది. కంపెనీ సాధించిన అత్యధిక త్రైమాసిక లాభం ఇదే కావడం గమనార్హం. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం 166 కోట్ల మేర సానుకూల ప్రభావం చూపించిందని ఐటీసీ పేర్కొంది. నికర అమ్మకాలు 12,019 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో  12,759 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.  సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం వృద్ధితో  5,842 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారం 6 శాతం వృద్ధితో  9,138 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీ యేతర వ్యాపారాల ఆదాయం 4 శాతం పెరిగి 3,286 కోట్లకు చేరాయి. ఇక హోటళ్ల వ్యాపారం ఆదాయం 17 శాతం వృద్ధితో  446 కోట్లకు చేరుకుంది. ఇక వ్యవసాయ వ్యాపార విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో 2,674 కోట్లకు,...

ఇండియా టి20 టీమ్ ఇదే

చిత్రం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో నవంబర్ నెలలో జరిగే టి 20 తో పాటు టెస్ట్ మ్యాచ్ ల కోసం గాను టీమిండియా క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలక మండలితో పాటు క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ ప్రకటించారు. అయితే భారత జట్టు సారధి కోహ్లి మరోసారి విశ్రాంతి ఇవ్వాలని కోరుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో వచ్చేజరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ జట్టుకు సారధిగా వ్యవహరిస్తాడు. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన కమిటీ టి20, టెస్టు జట్లను ప్రకటించింది. టి20 జట్టులో ఇద్దరికి కొత్తగా అవకాశం దక్కింది. ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే తొలి సారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. కేరళ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ సంజు శామ్సన్‌ను కూడా మళ్లీ టీమ్‌లోకి ఎంపిక చేశారు. రిషభ్‌ పంత్‌ కూడా జట్టులో ఉన్నా, సంజు శామ్సన్‌ను రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. చహల్‌ కూడా కొంత విరామం తర్వాత పునరాగమనం చేశాడు. బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ ఇంకా గాయాల నుంచి కోలుకోక పోవడంతో వారి పేర్లను పరిశీలించ లేదు. ఇటీవలి ...

కోటపై కొలువు తీరేదెవ్వరో

చిత్రం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది. బీజేపీ నేతలు ఆశించినంత, ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపిన స్థాయిలో మెజారిటీ రాలేదు. బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో  ఎన్నికల్లో బీజేపీ,శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 24 సీట్లలో విజయం సాధించారు. కాషాయ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌ 45, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ 54 సీట్లు గెలుచు కున్నాయి. ఫలితాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ సంచలన కామెంట్స్ చేశారు. శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేక పోలేదన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం వచ్చే ఐదేళ్లు బీజేపీ, శివసేన కూటమే అధికారంలో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు, అధికారాన్ని సమానంగా పంచుకోవాలన్న ఫార్మూలాను శివసేన తెరపైకి తెచ్చింది. కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే దానిపై ఒప్పుకున్నారు అని ...

నష్టాలు లెక్క కాదంటున్న ఇండిగో

చిత్రం
భారత ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిడుకులు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా విమానయన రంగాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉండగా చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో 652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు 1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ వెల్లడించింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి 428 కోట్ల ఫారెక్స్‌ నష్టాలు, 319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్‌ దత్తా తెలిపారు. మొత్తం ఆదాయం 6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో 8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో  987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో 1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచ్చిన  సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి 9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికల పైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్న...

మెగాస్టార్ తోనే ప్రారంభం

చిత్రం
తెలుగు సినిమా రంగంలో ఆయనకు తిరుగు లేదు. ఎందరు నటులు వచ్చినా ఆయన పేరు ఎత్త కుండా మనలేని పరిస్థితి. అతడు ఎవరో కాదు కోట్లాది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి. చిరు ఇటీవల నటించిన సైరా బాక్సాఫీస్ లను బద్దలు కొట్టింది. అయితే తనతో పాటు నటించిన, నటిస్తున్న నటీనటులందరితో కలిసి ప్రతి ఏడు గడపడం చిరుకు అలవాటు. దీనికి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. అదేమిటంటే క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌. 1980లో నటించిన స్టార్స్‌ పెట్టుకున్న పేరు ఇది. ప్రతీ ఏడాది ఒక చోట కలుస్తూ రీయూనియన్‌ జరుపుకుంటారు అప్పటి హీరో హీరోయిన్లు. ఇందులో మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్‌కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్‌ వంటి స్టార్స్‌ ఉన్నారు. కలిసిన ప్రతిసారి ఆ పార్టీకి ఓ డ్రెస్‌ కోడ్‌ ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీ యూనియన్‌ ప్లాన్‌ చేస్తుంటారు. టీమ్‌లో ఉన్న ఓ స్టార్‌ అందరికీ పార్టీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ పదో యానివర్శరీ. టెన్త్‌ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లో చి...

ధర్మాసనం ఆగ్రహం..ఐఏఎస్..లు మౌనం

చిత్రం
అసలు మీరు ఈ దేశ పౌరులు కారా. అసలు మీరేం చేస్తున్నారు. ఓ వైపు డెంగీ వ్యాధితో రోగులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్ర పోతుందా. మీ తీరు బాగోలేదు. బాధ్యతలను విస్మరించి ప్రవర్తిస్తున్నారు. మీ తీరు గర్హనీయం అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. డెంగీ గురించి వివరణ ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్‌ కుమార్‌ జోషి , మున్సిపల్‌ శాఖ కార్యదర్శి న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు, అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. మూసీ నదిని ఆనుకుని ఉన్న హైకోర్టులోనే దోమలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీఎస్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దోమల నివారణకు 1000 మిషన్లు కొనుగోలు చేయాలని..వీటి కోసం ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపింది. ఒకవేళ డెంగీ వ్యాధి నివారణ...

అంపశయ్యపై ఆర్టీసీ..యూనియన్లపై సీఎం ఫైర్

చిత్రం
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరుపం. కార్మికులు, అధికారులు మంచి వారే, కానీ యూనియన్ల కారణంగానే ఇదంతా జరుగుతోంది. ఎస్మా కూడా వీరిపై ఉంది. కోర్టుకు కూడా అధికారం లేదు. కేవలం ప్రజలకు ఇబ్బంది ఎదురవుతోంది, దానిని దృష్టిలో పెట్టుకుని పరిష్కరించమని కోరింది. ఎవడో వెధవ చెబితే సమ్మెకు దిగుతారా. కూర్చున్న కొమ్మను వారే నరుక్కుంటున్నారు. దానికి నేనేం చేయలేను. ఒక్క సంతకంతో పర్మిట్ ఇచ్చేస్తా. ఇక రోడ్లపై వద్దంటే బస్సులు నడుస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫిట్ మెంట్ ఇచ్చా, వేతనాలు పెంచా అయినా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. ఇలీనం చేయాలని అంటున్నారు. వీరిని చేస్తే మిగతా కార్పొరేషన్స్ కూడా తమను విలీనం చేయాలని కోరుతాయి. ఇది జరగని పని. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండ బోదని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్మికులు పిచ్చి పంథాలో సమ్మె చేస్తున్నారని మండి పడ్డారు. సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. కార్మికుల భవి...

మరాఠాపై మగధీరుడు ఎవ్వరో

చిత్రం
మరాఠాలో రాజకీయాలు వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నా..సీఎం పీఠం దగ్గర మాత్రం పీఠముడి ఇంకా తొలగి పోలేదు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలోని బీజేపీ, శివసేన కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కును విజయవంతంగా దాట గలిగింది. కానీ భారీగా స్థానాలు సాధించలేక పోయింది. కాషాయ పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గగా..దాని మిత్ర పక్షం శివసేన తన స్థానాలను మెరుగు పరుచుకొని.. రియల్‌ కింగ్‌ మేకర్‌గా అవతరించింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా ఘోరంగా ఏమీ ఓడి పోలేదు. కాంగ్రెస్‌ మిత్రపక్షం ఎన్సీపీ గతంలో కంటే గణనీయంగా తన స్థానాలను పెంచుకుంది. ఈ పరిణామాలు సహజంగానే అధికార బీజేపీపై హీట్‌ పెంచుతున్నాయి. కాంగ్రెస్‌ కూటమితో శివసేన అధికారాన్ని పంచు కోవచ్చునని ఊహాగానాలు గుప్పు మన్నాయి. వీటిని బేఖాతర్ చేస్తూ శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావత్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పిన ఆయన..అందులో ఓ మెలిక పెట్టారు. గతంలో లాగా  ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీకి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సంకీర్ణ కూటమిలో భాగంగా అధికారాన్ని చెరో...

కాంగ్రెస్ డీలా..ఎంఐఎం భళా

చిత్రం
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త మలుపు. ఎవరూ ఊహించని ఫలితాలు ఇవి. మోడీ పనితీరుకు ప్రతీకగా నిలిచిన ఉప ఎన్నికల్లో కొంత వ్యతిరేకత ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. గణనీయమైన స్థానాలు గెలుపొందనప్పటికీ.. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసింది. ఎన్సీపీ, బిజెపి, శివసేన, తదితర పార్టీలు బరిలో నిలిచినా ఎంఐఎం మాత్రం తన హవాను కొనసాగించింది. ఎక్కువగా ఎంఐఎం వల్ల కాంగ్రెస్ కు భారీగా గండి కొట్టింది. ఇది కోలుకోలేని షాక్. 44 స్థానాల్లో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంప గుత్తగా కాంగ్రెస్‌ పార్టీకే పడేవి. ఈసారి మజ్లీస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లు చీలడం, బీజేపీ, శివసేన కూటమికి వరంగా మారింది. దీంతో కాంగ్రెస్‌కు పట్టున్న కొన్ని స్థానా ల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా విజయం సాధించింది. ఎంఐఎం పోటీ వల్ల బీజేపీ, శివసేన కు లాభం చేకూరగా, కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమిలో రెండ...

బీఎస్ఎన్ఎల్ కు కాయకల్ప చికిత్స

చిత్రం
కేంద్రంలో రెండవ సారి కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్ళలో ఓ మంచి నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే దేశంలోనే అతి పెద్ద నెట్ వర్క్ తో పాటు బ్యాండ్ విడ్త్ కలిగిన సంస్థగా పేరున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కు కాయకల్ప చికిత్స అందించే పనిలో పడ్డది. నిన్నటి దాకా నష్టాల్లో కూరుకు పోయిన బీఎస్ఎన్ఎల్ ను ప్రైవేట్ పరం చేస్తారన్న అనుమానాలను సిబ్బంది వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దీనిపై నెలకొన్న ఉత్కంఠకు చెక్ పెట్టింది. నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థను మూసేయ బోమని క్లారిటీ ఇచ్చింది. బీఎస్​ఎన్​ఎల్​లో, ఎంటీఎన్ఎల్ విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించు కోబోమని, కొత్తగా 29,937 కోట్ల రివైవల్ ప్యాకేజీని అందిస్తామని టెలికాం శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. కుంటి నడకన నడుస్తున్న బీఎస్​ఎన్​ఎల్​లో, ఎంటీఎన్ఎల్ కంపెనీలను రివైవ్‌‌‌‌ చేసే దిశలోనే విలీన ప్రతిపాదనను ఆమోదించారు. బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌కు సబ్సిడరీగా ఎంటీఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ ఉంటుందని, రాబోయే రెండేళ్లలో ఈ రెండూ లాభాల బాట పడతాయని ప్రసాద్‌‌‌‌ వెల్లడ...

ఉన్నత విద్య లక్ష్యం..గ్రామీణాభివృద్ధి కోసం

చిత్రం
ఉన్నత విద్య ముఖ్య ఉద్దేశం గ్రామాల అభివృద్ధి కోసం సాగాలని ఏపీ రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ అభిప్రాయ పడ్డారు.   నాగార్జున యూనివర్సిటీలో మహాత్మా గాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌, యునిసెఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మన మధ్య లేరు. కానీ ఆయన ఆచరించిన విలువలు, శాంతి మార్గం ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచింది. విద్య వ్యాపారాత్మకంగా కాకుండా సమాజాభివృద్ధి కోసం సాగాలని మహాత్ముడు కోరుకున్నారు. అందుకే ఆయనను నేటికీ యావత్ ప్రపంచం ఆచరిస్తోంది. గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ దేశంలో సాంఘిక, ఆర్థిక ఎదుగుదల కోసం, నైతిక విలువలు పెంపొందించడం కోసం గాంధీజీ కృషి చేశారు. మహాత్ముడు చెప్పినట్లు, నా హృదయం ఎప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుందన్న నినాదాన్ని విద్యార్థుల్లో నాటుకునేలా ఉపాధ్యాయులు, ఆచార్యులు, మేధావులు, సామాజికవేత్తలు పాటు పడాలని హరిభూషణ్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించు కునేలా ఎన్నో ప్రయత్నాలను చేస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సరైన విద్య కొనసాగితేనే దేశ ఆర్థికాభివృద్ధికి ప్రయోజనకర...