బన్నీపై భారీ అంచనాలు


రోజు రోజుకు తనను తాను కొత్త గెటప్ లో చూసు కోవడం తో పాటు జనానికి వినోదం పంచాలనే కసితో ఎప్పుడూ ప్రయత్నం చేసే పనిలో నిమగ్నమై ఉంటాడు బన్నీ అలియాస్ అల్లు అర్జున్. గంగోత్రి నుంచి నేటి అల వైకుంఠపురం సినిమా దాకా అన్నీ డిఫరెంట్ సినిమాలే. నడిచినా నడవక పోయినా పట్టించు కోకుండా డైరెక్టర్లు కోరిన దాని కంటే ఎక్కువగా కష్టపడతాడు. ఇప్పుడున్న హీరోలలో బన్నీది ఓ విలక్షణమైన కేరెక్టర్. టేకింగ్ లోను, డైలాగ్ డెలివరీ లోను బన్నీ కి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందుకే అతడితో సినిమాలు తీసేందుకు ఇష్ట పడతారు. బన్నీతో ప్రయాణం చాలా జోవియల్ గా ఉంటుందని అప్పట్లో ప్రముఖ దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. ఇదే సమయంలో అతడితో ఆయన మూడో సినిమా తీస్తున్నారు. అది దాదాపుగా పూర్తి కావొచ్చింది.

ఇంతకు ముందు త్రివిక్రమ్ తో బన్నీ జులాయి,  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు తీశాడు. అవి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో అల వైకుంఠపురం లో అనే పేరుతో సినిమా తీస్తున్నారు. రాబోయే సంక్రాంతి కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అటు త్రివిక్రమ్ ఇటు బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ దుమ్ము రేపాయి. దీని కోసం బన్నీ చాలా కష్టపడ్డాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.

'నా పేరు సూర్య' సినిమా తరువాత ఈ అల్లు వారబ్బాయి కాస్త లావయ్యాడు. అందుకే త్రివిక్రమ్ సినిమా కోసం బన్నీ వెయిట్ తగ్గాడు. అల్లు అర్జున్‌కి ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. ఈ స్టైలిష్ స్టార్‌కి హిట్ పడి ఇప్పటికే మూడేళ్లు దాటి పోయింది. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ 'అల వైకుంఠపురంలో' సినిమా పై పెట్టుకున్నాడు. పక్కా లెక్కలతో సిద్ధం అవుతున్న 'అల వైకుంఠపురంలో' మూవీ బన్నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!