నష్టాలు లెక్క కాదంటున్న ఇండిగో
భారత ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిడుకులు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా విమానయన రంగాన్ని కుదిపేస్తోంది. ఇదిలా ఉండగా చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో 652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు 1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ వెల్లడించింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి 428 కోట్ల ఫారెక్స్ నష్టాలు, 319 కోట్ల నిర్వహణ వ్యయాల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ రొనొజాయ్ దత్తా తెలిపారు.
మొత్తం ఆదాయం 6,514 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో 8,540 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ2లో 987 కోట్లుగా ఉన్న స్థూల నష్టాలు ఈ క్యూ2లో 1,032 కోట్లకు పెరిగాయని దత్తా చెప్పారు. ఈ క్యూ2లో ఒక్కో విమాన ప్రయాణికుడి నుంచి వచ్చిన సగటు చార్జీ 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇక మొత్తం వ్యయాలు 28 శాతం పెరిగి 9,572 కోట్లకు పెరిగాయని తెలిపారు. వృద్ధి ప్రణాళికల పైననే దృష్టి పెడుతున్నానమని, దేశీయంగా, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధిగమిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉండడం కూడా మరో కారణమన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి