ఇండియా టి20 టీమ్ ఇదే

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో నవంబర్ నెలలో జరిగే టి 20 తో పాటు టెస్ట్ మ్యాచ్ ల కోసం గాను టీమిండియా క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలక మండలితో పాటు క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ ప్రకటించారు. అయితే భారత జట్టు సారధి కోహ్లి మరోసారి విశ్రాంతి ఇవ్వాలని కోరుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో వచ్చేజరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అతను దూరమయ్యాడు. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ జట్టుకు సారధిగా వ్యవహరిస్తాడు. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో సమావేశమైన కమిటీ టి20, టెస్టు జట్లను ప్రకటించింది. టి20 జట్టులో ఇద్దరికి కొత్తగా అవకాశం దక్కింది. ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే తొలి సారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. కేరళ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ సంజు శామ్సన్‌ను కూడా మళ్లీ టీమ్‌లోకి ఎంపిక చేశారు.

రిషభ్‌ పంత్‌ కూడా జట్టులో ఉన్నా, సంజు శామ్సన్‌ను రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌గా టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. చహల్‌ కూడా కొంత విరామం తర్వాత పునరాగమనం చేశాడు. బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌ ఇంకా గాయాల నుంచి కోలుకోక పోవడంతో వారి పేర్లను పరిశీలించ లేదు. ఇటీవలి కాలంలో భారత్‌ తరఫున అద్భుతంగా రాణిస్తూ వచ్చిన రవీంద్ర జడేజాకు టీమ్‌లో చోటు దక్కలేదు. నవదీప్‌ సైనీ ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా శార్దుల్‌ను ఎంపిక చేశారు. అయితే సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన షాబాజ్‌ నదీమ్‌కు నిరాశ ఎదురైంది. రాంచీ టెస్టులో నాలుగు వికెట్లతో రాణించి అందరినీ ఆకట్టుకున్నా...బంగ్లాతో సిరీస్‌కు ఛాన్స్ రాలేదు.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఆడిన జట్టులో ఉన్న కుల్దీప్‌ యాదవ్‌ కోలు కోవడంతో బోర్డు విధానం ప్రకారం మళ్లీ అతడినే ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా టీమిండియా జట్టు ఇలా ఉంది. టి 20 కి రోహిత్‌ సారధిగా ఉంటాడు. ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్‌ పాండే, సంజు శామ్సన్, రిషభ్‌ పంత్, దూబే, కృనాల్, వాషింగ్టన్‌ సుందర్, చహల్, దీపక్‌ చహర్, రాహుల్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్, శార్దుల్‌ ఠాకూర్‌ లు ఆడతారు. ఇక టెస్టు జట్టుకు కోహ్లీ సారధిగా ఉండగా   మయాంక్, రోహిత్, పుజారా, రహానే, విహారి, సాహా, పంత్, జడేజా, అశి్వన్, షమీ, ఇషాంత్, ఉమేశ్, కుల్దీప్, శుబ్‌మన్‌ గిల్‌ లను ఎంపిక చేశారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!