కాంగ్రెస్ డీలా..ఎంఐఎం భళా

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త మలుపు. ఎవరూ ఊహించని ఫలితాలు ఇవి. మోడీ పనితీరుకు ప్రతీకగా నిలిచిన ఉప ఎన్నికల్లో కొంత వ్యతిరేకత ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. గణనీయమైన స్థానాలు గెలుపొందనప్పటికీ.. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసింది. ఎన్సీపీ, బిజెపి, శివసేన, తదితర పార్టీలు బరిలో నిలిచినా ఎంఐఎం మాత్రం తన హవాను కొనసాగించింది. ఎక్కువగా ఎంఐఎం వల్ల కాంగ్రెస్ కు భారీగా గండి కొట్టింది. ఇది కోలుకోలేని షాక్.

44 స్థానాల్లో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంప గుత్తగా కాంగ్రెస్‌ పార్టీకే పడేవి. ఈసారి మజ్లీస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లు చీలడం, బీజేపీ, శివసేన కూటమికి వరంగా మారింది. దీంతో కాంగ్రెస్‌కు పట్టున్న కొన్ని స్థానా ల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా విజయం సాధించింది. ఎంఐఎం పోటీ వల్ల బీజేపీ, శివసేన కు లాభం చేకూరగా, కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ తగిలింది.

కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమిలో రెండో స్థానానికి పడి పోయింది. గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా ఈసారి నిలబెట్టు కోలేక పోయింది. బీజేపీ, శివసేన కూటమి మరోసారి కంఫర్టబుల్ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోగా.. మరోవైపు మరాఠా కురు వృద్ధుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పర్వాలేదనిపించగా, కాంగ్రెస్‌ మాత్రం కొన్ని స్థానాలకే పరిమితమైంది. ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో ఎంఐఎం హవా కొనసాగించింది. ఇక్కడ 80  శాతానికి పైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం. మొత్తంగా చూస్తే ఎంఐఎంకు ఈ ఉప ఎన్నికలు అసదుద్దీన్ ఒవైసీకి జోష్ కలిగించాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!