మెగాస్టార్ తోనే ప్రారంభం
తెలుగు సినిమా రంగంలో ఆయనకు తిరుగు లేదు. ఎందరు నటులు వచ్చినా ఆయన పేరు ఎత్త కుండా మనలేని పరిస్థితి. అతడు ఎవరో కాదు కోట్లాది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి. చిరు ఇటీవల నటించిన సైరా బాక్సాఫీస్ లను బద్దలు కొట్టింది. అయితే తనతో పాటు నటించిన, నటిస్తున్న నటీనటులందరితో కలిసి ప్రతి ఏడు గడపడం చిరుకు అలవాటు. దీనికి ఓ పేరు కూడా పెట్టుకున్నారు. అదేమిటంటే క్లాస్ ఆఫ్ ఎయిటీస్. 1980లో నటించిన స్టార్స్ పెట్టుకున్న పేరు ఇది. ప్రతీ ఏడాది ఒక చోట కలుస్తూ రీయూనియన్ జరుపుకుంటారు అప్పటి హీరో హీరోయిన్లు.
ఇందులో మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్‌కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్ వంటి స్టార్స్ ఉన్నారు. కలిసిన ప్రతిసారి ఆ పార్టీకి ఓ డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీ యూనియన్ ప్లాన్ చేస్తుంటారు. టీమ్‌లో ఉన్న ఓ స్టార్ అందరికీ పార్టీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పదో యానివర్శరీ.
టెన్త్ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లో చిరంజీవి స్వగృహంలో జరగనుందని తెలిసింది. ఇటీవలే చిరంజీవి తన నివాసాన్ని కొత్త హంగులతో రీమోడలింగ్ చేయించారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో కొత్తగా తయారైన ఇంట్లో వేడుక కూడా చేశారు. ఇక రీ–యూనియన్‌కి ఈసారి తన ఇల్లే వేదిక అయింది. వచ్చే నెలలో ఈ పార్టీ జరగనుంది. హోస్ట్‌గా ఈ పార్టీని సక్సెస్ చేసేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. సైరా ఇచ్చిన సక్సెస్ తో మెగాస్టార్ ఊపు మీదున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి