ఆర్టీసీ కేసీఆర్ జాగీర్ కాదు
ఆర్టీసీ ప్రజల ఆస్తి. ఇది ముమ్మాటికీ కార్మికులది. కేసీఆర్ స్వంత జాగీరు కాదు. ఆయన అనుకున్నట్టు చేస్తానంటే కుదరదు. ఇక్కడ చెల్లదు. ఇది ముమ్మాటికీ కార్మికుల రెక్కల కష్టం తో నిర్మించుకున్న స్వేద సౌధం. దీనిపై కన్నేసినా లేదా రెప్పలా వాల్చినా ఊరుకోమని స్పష్టం చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఇక ఆర్టీసీ పని అయిపోయినట్లేనని, దాని కథ ముగిసిందని, కొందరు వెధవలు చెబితే కార్మికులు నమ్మి సమ్మెలోకి పోయారని, వారిపై ఎస్మా ఇప్పటికే ఉందని, కోర్టుకు శాసించే అధికారం లేదని, ఇక కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని..ఆ మాటలకు కట్టుబడి ఉన్నానని సీఎం కేసీఆర్ చెప్పారు.
అంతే కాకుండా ఆర్టీసీని సర్వ నాశనం చేసింది కార్మికులు కాదని, వారిని పెడదోవ పట్టిస్తూ గడుపుతున్న యూనియన్ నేతలని మండిపడ్డారు. ఒక్క సంతకం చేస్తా..పర్మిట్లు ఇస్తా..వెహికిల్స్ ఎందుకు తిరుగవో చూస్తానని కేసీఆర్ అన్నారు. దీనిపై ఆర్టీసీ నాయకులు, విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారులకు దారదత్తం చేసేందుకే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నాడని అశ్వత్థామ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం ఆయన దురహంకారాన్ని తెలియ చేస్తుందన్నారు. యూనియన్ల వల్లే ఆర్టీసీ ఇంకా బతికుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశామని, సమ్మెపై వెనెక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి