పూరికి సల్మాన్ బంపర్ ఆఫర్
తెలుగు సినిమా రంగంలో ఇప్పటికే మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కు పేరుంది. ఆయన ప్రముఖ దిగ్గజ దర్హకుడు రామ్ గోపాల్ వర్మ టీమ్ లో సభ్యుడు. ఆర్జీవీ ఫ్యాక్టరీ లోంచి వచ్చిన ప్రతి ఒక్కరు తమ టాలెంట్ తో ఇండియాను షేక్ చేశారు. టాప్ మోస్ట్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు. వేలాది మందికి ఛాన్స్ ఇచ్చారు. కొందరికి లైఫ్ ఇచ్చారు. వారిలో పూరి జగన్నాథ్ మొదటి ప్లేస్ లో ఉంటాడు. అటు తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ ఇండస్ట్రీస్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు తీశాడు. తెలుగులో మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి తీశాడు. అది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రవితేజ తో ఇడియట్ తీశాడు. అది కూడా హిట్టే. ఇక ప్రిన్స్ మహేష్ బాబు తో పోకిరి తీశాడు. అది బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలిచింది.
వసూళ్లను తిరుగ రాసింది. దీంతో పూరి జగన్నాథ్ ఎన్నో సినిమాలు తీశాడు. కొన్ని హిట్ గా నిలిస్తే మరికొన్ని ఆడలేదు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశాడు పూరి జగన్నాథ్. పోయిన డబ్బులు తిరిగి వచ్చాయి. పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిన పూరి తిరిగి పైకి లేశాడు. తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా సక్సెస్ తో మాంచి ఊపు మీదున్న పూరి జగన్నాథ్ కు మరిన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పూరికి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. దబాంగ్-3 ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్..పూరీ ఒకే అంటే సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
పూరీ జగన్నాథ్‌తో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రభుదేవా, తాను త్వరలో పూరీని కలుస్తామన్నారు. అన్ని కుదిరితే పూరీతో సినిమా ఉంటుందని సల్మాన్ వెల్లడించారు. కాగా తెలుగులో తీసిన ‘పోకిరి’ సినిమా హిందీ రిమేక్ ‘వాంటెడ్’లో సల్మాన్ ఖాన్ నటించారు. అప్పటి నుంచి పూరీ జగన్నాథ్ తీసిన ప్రతి సినిమాపై సల్మాన్ ఖాన్ దృష్టి పెడుతున్నారు. పూరీ డైరెక్షన్ లోనే పని చేసేందుకు తాను ఆతృతగా ఉన్నట్లు తెలిపారు. మరి సల్మాన్‌తో సినిమాపై పూరీ జగన్నాథ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి