షాకు షాక్..మోదీకి ఝలక్

మోడీ ఛరిష్మా ..అమిత్ షా మ్యాజిక్ హరియాణా లో వర్కవుట్ కాలేదు. అబ్‌కీ బార్‌ 75 కే పార్‌ అని ధీమాగా  ఎన్నికల రణాంగంలోకి దూకిన బీజేపీ అంచనాలు అనూహ్యంగా తలకిందులయ్యాయి. ఇక్కడ త్రిశంకు సభ ఏర్పడింది. అతి ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీగా అవతరించడం ఒక్కటే బీజేపీకి కాస్త ఊరట. ఓ ఆరుగురిని తమ వైపునకు తిప్పుకొంటే మళ్లీ వారిదే ప్రభుత్వం. ఇందు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్యను కలిసి అభ్యర్థించారు.

90 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 70 పైచిలుకు స్థానాలు ఖాయమని బీజేపీతో పాటు మెజారిటీ చానెళ్లు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో అంచనా వేశాయి. ఫలితాలు వెల్లడి అయ్యాక బీజేపీ ఖాతా 40 దాటలేక పోయింది. కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు చేస్తూ 30 సీట్లు సాధించింది. కొత్త పార్టీ జననాయక్‌ జనతా పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అవిభక్త ఐఎన్‌ఎల్‌డీ పార్టీ  చీలికలతో కుదేలై చివరకు ఒక్క స్థానాని కే పరిమిత మైంది. సమాజ్‌వాదీ పార్టీ రెండు స్థానాలను గెల్చుకోగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచి కీలకంగా మారారు.

2018లో కర్ణాటక అసెంబ్లీ తరహా పరిస్థితి ఇపుడు హరియాణాలో ఏర్పడింది. సర్కార్ ఏర్పాటు కమలానికి ఛాన్సెస్ ఉన్నాయి. పవర్ లోకి రావాలంటే కనీసం 6 సీట్లు కావాల్సి ఉంది. గెలుపొందిన ఏడుగురు స్వతంత్రుల్లో ఐదుగురు బీజేపీ రెబెల్సే. టికెట్‌ ఇవ్వలేదన్న కారణంతో ఇండిపెండెంట్‌లుగా బరిలో దిగారు. వీరందరినీ తమవైపు తిప్పుకోవడం బీజేపీకి కష్టమేమీ కాదు. ఖట్టార్‌ ఇప్పటికే వారితో టచ్‌లో ఉన్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో 8 మంది మంత్రులు ఓడిపోవడం కొసమెరుపు. అయితే దుశ్యంత్ కీలకంగా మారడం విశేషం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!