లాభాల బాటలో ఐటీసీ

మార్కెట్ వర్గాల అంచనాలు తలకిందులు చేస్తూ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థ ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో  4,174 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం  .3,045 కోట్లుతో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ వెల్లడించింది. పేపర్‌ బోర్డ్స్, హోటళ్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఇతర వ్యాపారాలలో జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని తెలిపింది. కంపెనీ సాధించిన అత్యధిక త్రైమాసిక లాభం ఇదే కావడం గమనార్హం. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం 166 కోట్ల మేర సానుకూల ప్రభావం చూపించిందని ఐటీసీ పేర్కొంది.

నికర అమ్మకాలు 12,019 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో  12,759 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.  సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం వృద్ధితో  5,842 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారం 6 శాతం వృద్ధితో  9,138 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీ యేతర వ్యాపారాల ఆదాయం 4 శాతం పెరిగి 3,286 కోట్లకు చేరాయి. ఇక హోటళ్ల వ్యాపారం ఆదాయం 17 శాతం వృద్ధితో  446 కోట్లకు చేరుకుంది.

ఇక వ్యవసాయ వ్యాపార విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో 2,674 కోట్లకు, పేపర్‌ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్‌ విభాగం ఆదాయం 10 శాతం పెరిగి  1,565 కోట్లకు  పెరిగాయని ఐటీసీ పేర్కొంది. మొత్తం మీద ఆర్ధిక మందగమన ప్రభావం ఐటీసీ  మీద పడక పోవడం ఒకింత విస్తు పోయేలా చేసింది. 

కామెంట్‌లు