మీటూ కే జై అంటున్న పూజా హెగ్డే


ఇండియన్ సినిమా రంగంలో మీటూ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. చాలా మంది వేధింపులకు గురయ్యారు. మరికొందరు హీరోయిన్లు తమకు ఎక్కడ అవకాశాలు రావేమోననే భయంతో బయటకు రాలేదు. దీంతో ఈ టార్చర్ ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నదేనని కొందరు బహిరంగంగా తమ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. వారిలో మొదటగా చెప్పాల్సింది ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద. ఆమె తన వాయిస్ ను మొదటి సారిగా వెల్లడించింది. ప్రముఖ రచయిత వైరముత్తు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమెతో పాటు ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ గారాల పట్టి, సినీ నటి వరలక్ష్మి సైతం గళం విప్పింది.

తనకు కూడా ఇలాంటి వేధింపులు తప్పలేదంటూ పేర్కొంది. వీరే కాకుండా పలువురు బయటకు వచ్చి ధైర్యంగా తమ పట్ల డైరెక్టర్స్, ఇతరులు ఎలా వేధింపులకు పాల్పడ్డారో చెప్పారు. ఈ మీటూ దేశమంతటా వైరల్ అయ్యింది. తాజాగా ప్రముఖ తెలుగు నటి పూజా హెగ్డే సైతం మీటూ ఉండాల్సిందేనంటూ స్పందించింది. మీటూ ఉద్యమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నటిగా, స్త్రీగా నా అభిప్రాయమేంటంటే..ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోకూడదు. మీటూ వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా. బయటకు వచ్చి ఈ విషయాలను చెప్పడానికి చాలా ధైర్యం కావాలి.

బాధితులందరి ధైర్యాన్ని అభినందిస్తున్నాను అని మీటూ మూమెంట్‌ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పూజా హెగ్డే. అక్షయ్‌కుమార్, సన్నీ డియోల్, పూజా హెగ్డే, రానా, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ముందుగా ఈ చిత్రానికి సాజిద్‌ ఖాన్‌ దర్శకుడు. దాదాపు 70 శాతం సినిమాని కూడా పూర్తి చేశారు. అయితే ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రీకరణలో ఉండగానే, ఆయన  మీద ‘మీటూ’ ఆరోపణలు రావడంతో దర్శకుడిగా తప్పించారు. ఆ విషయం గురించి పూజా మాట్లాడుతూ సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడిని తప్పించడ మంటే సినిమాకు చాలా ఇబ్బంది కరమైన పరిస్థితి. కానీ నిర్మాణ సంస్థ ఆ ఇబ్బంది ఏం తెలియ నివ్వలేదు. 

కామెంట్‌లు