విద్యార్థులకు గైడ్ లైన్ - విద్యా హెల్ప్ లైన్ - తెలంగాణ పోరని గెలుపు కథ

విద్యా హెల్ప్ లైన్ గురించి ఎవరిని అడిగినా ఠకీమని చెప్పేస్తారు హైదరాబాద్ సిటీలో. ఇదో పేరుకు స్వచ్చంధ సంస్థనే. కానీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా బిట్స్ పిలానీలో చదువుకుని, ఉన్నతమైన జాబ్స్‌ను వదిలేసుకుని ..కేవలం స్టూడెంట్స్ బాగు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణ కుర్రాడి కథ ఇది. వికారాబాద్‌కు చెందిన పుచ్చకాయల చంద్రశేఖర్ సాంకేతిక పరంగా మంచి విజన్ ఉన్న యువకుడు. తాను నేర్చుకున్న, తాను అనుభవించిన ఇబ్బందులను భావితరాలకు చెందిన పిల్లలకు కలగకూడదనే ఉద్ధేశంతో నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ పేరుతో ఎన్‌జిఓను స్థాపించాడు. అది అంచెలంచెలుగా తన సేవా కార్యక్రమాలను విస్తరించుకుంటూ పోయింది. దాతలు, సంస్థలు చంద్రశేఖర్ అండ్ టీం కలిసి చేస్తున్న ప్రోగ్రామ్స్ ను చూసి ఇంప్రెస్ అయ్యారు. వారు కూడా తోచిన రీతిలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారందిస్తున్న చేయూతతోనే ఇంకా ముందుకు వెళ్లగలుగుతున్నామని అంటున్నారు చంద్రశేఖర్ వినమ్రంగా. ఇక్కడ కుల, మతాలకు, వర్గాలకు తావు లేదు. కేవలం ప్రభుత్వ బడుల్లో చదువుకుని అందరికంటే టాప్‌లో నిలిచిన వారికి ఆయా కంపెన...