కొత్త కేబినెట్‌లో రోజాకు నో ఛాన్స్
ఐరెన్ లెగ్ గా అపవాదులు ఎదుర్కొని, ఆరోపణలు, విమర్శలు తట్టుకుని వైఎస్ఆర్‌సీపీకి అన్ని వేళలా అండగా నిలిచి..ప్రత్యర్థులకు తన మాటల తూటాలతో ముచ్చెమటలు పోయించి..ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి తన సత్తా ఏమిటో చూపించిన రోజా సెల్వమణికి జగన్ కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఎవరున్నా లేక పోయినా తన స్వంత చెల్లెలి కంటే ఎక్కువగా..మిన్నగా రోజాను చూసుకున్నారు జగన్. సమయం చూసుకుని ఆమెకు సముచిత స్థానాన్ని కల్పించడం జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో భాగంగా స్పష్టం చేశారు. థంబింగ్ మెజారిటీ రావడం, జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగి పోయాయి. పార్టీ కోసం పనిచేశారు. తాను ఎక్కడా తగ్గలేదు. చంద్రబాబును ఆయన పరివారాన్ని, చివరకు ఆయన కొడుకు లోకేష్ ను అడుగడుగునా నిలదీశారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రజల మధ్యనే వుంటూ నిజమైన ప్రజా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి ఆమె శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. బై బై బాబు అంటూ నిప్పులు చెరిగారు. ఏపీని అప్పులపాలు చేసి..ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన తెలుగుదేశం పార్టీకి ఇక నూకలు చెల్లినట్టేనని వ్యాఖ్యానించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల కోసం పనిచేయడమే తనముందున్న కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. జగన్‌కు వెన్నుదన్నుగా వుంటూ ..పార్టీ పటిష్టత కోసం పనిచేసిన రోజాకు ప్రకటించిన మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై ఆ పార్టీకి చెందిన వారే కాకుండా విపక్షాలు సైతం విస్మయానికి గురయ్యాయి.
ఎవరికి రాక పోయినా ..రోజాకు మాత్రం బెర్త్ మాత్రం ఖాయమంటూ ప్రచారం ఊపందుకుంది. ఐదేళ్ల పాటు టీడీపీ ఆగడాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులతో కలిసి పోరాటం చేసింది రోజా. ఆమె ఓ ఫైర్ బ్రాండ్‌గా ఎదిగారు. వైసీపీలో నెంబర్ వన్ మహిళా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీలో విస్మరించలేని లీడర్‌గా తనను తాను మలుచుకున్నారు. తనపై లూజ్ కామెంట్స్ చేసిన వారికి తన గెలుపే సమాధానం చెబుతుందన్నారు. తాను ఐరన్ లెగ్ నంటూ కొందరు వెధవలు చేసిన వ్యాఖ్యలు నిజం కావని నా విజయంతో రూఢీ అయిందని రోజా చెప్పారు.
చివరి వరకు రోజాకు స్పీకర్‌గా ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఎందుకనో జగన్ రోజాను విస్మరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాజిక సమతూకం పాటించిన జగన్ ..పార్టీకి జవసత్వాలు కల్పించిన రోజాకు ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇస్తారనే ప్రచారం లేకపోలేదు. తనపై నమ్మకం వుంచి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు రోజా. ఎక్కడా కామెంట్స్ చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళతానంటోంది ఆమె.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి